LPG connection
-
గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇక ఆన్లైన్లో
-
గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇక ఆన్లైన్లో చెల్లించొచ్చు!
వంటగ్యాస్ కనెక్షన్లకూ ఈఎంఐ! ముంబై: వంటగ్యాస్ సిలిండర్ రీఫిలింగ్ కోసం బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు కూడా చెల్లించేలా ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మాత్రమే ఉండేది. డబ్బులు మాత్రం సిలిండర్‌ను తెచ్చిన డెలివరీ బోయ్స్‌కు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్‌ను బుక్ చేసుకున్న సమయంలోనే, ఆన్లైన్లో రీఫిలింగ్ డబ్బులనూ చెల్లించవచ్చు. ఎల్పీజీ సిలిండర్ రీఫిలింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించే సౌకర్యాన్ని ఆదివారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు. ‘ప్రభుత్వ రంగ సంస్థలైన చమురు మార్కెటింగ్ సంస్థలు ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ప్రారంభించాయి’ అని ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆన్లైన్ చెల్లింపు సదుపాయాన్ని www.mylpg.in వెబ్సైట్ ద్వారా, 13 భాషల్లో పొందవచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ బుక్ చేసుకుని, డబ్బులు చెల్లించేలా టచ్ పాయింట్లను ఏర్పాటు చేసే విషయమూ ఆలోచిస్తున్నామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులకు వంటగ్యాస్ కనెక్షన్ల వ్యయాన్ని సమాన నెలసరి వాయిదాల(ఈఎంఐ) ద్వారా చెల్లించే అవకాశం కల్పించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) యోచిస్తున్నాయని వెల్లడించారు. వినియోగదారులు తమ కొత్త ఎల్పీజీ కనెక్షన్ ఖర్చు రూ. 3,400లను గరిష్టంగా 24 సమాన వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపై ఓఎంసీలు కసరత్తు చేస్తున్నాయన్నారు. -
జిల్లాకు 28,688 దీపం కనెక్షన్లు
తహశీల్దార్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక సాక్షి, గుంటూరు దీపం పథకం కింద జిల్లాకు 28,688 వంటగ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను తహశీల్దార్ల ఆధ్వర్యంలో అయిల్ కంపెనీలు, పౌర సరఫరాల అధికారులు సంయుక్తంగా ఎంపిక చేయూలని ఆదేశించింది. గతంలో ఈ బాధ్యతను ఎంపీడీవోలను నిర్వర్తించేవారు. దీపం కనెక్షన్లను మండల వారీగా కేటాయించనున్నారు. జన్మభూమి కార్యక్రమం ముగిశాక లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కనెక్షన్ డిపాజిట్ మొత్తం రూ.1450లను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ట్యూబు కోసం రూ.170, రిజిస్ట్రేషన్‌కు రూ.30, పాసు పుస్తకం కోసం రూ.50, ఇన్స్టాలేషన్ చార్జీ రూ.35 రూపాయలను మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. దారిద్య్రరేఖకు దిగువ న ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కనెక్షన్లు గ్రౌండ్ అయ్యేనా? ఏటా ప్రభుత్వం దీపం పథకం కింద భారీ సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో గ్రౌండ్ కావటం లేదు. గత ఏడాది జిల్లాకు 28,772 కనెక్షన్లు మంజూరు చేయగా కేవలం 12.977 కనెక్షన్లను మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. మిగతా కనెక్షన్లు మిగిలిపోయాయి. గత మూడు సంవత్సరాలుగా 50 శాతానికి పైగా కనెక్షన్లు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే భారీగా కనెక్షన్లు మంజూరు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. కనీసం ఈ ఏడాదైనా అన్ని కనెక్షన్లు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘శివారు’లో ఎన్నికల నగారా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం మెట్టు దిగింది. గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనంపై వెనక్కి తగ్గింది. విలీనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన 14 పంచాయతీలకు ఎన్నికల నగారా మోగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21న పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. నగరీకరణ నేపథ్యంలో రాజధాని పరిసరాల్లోని 36 పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వం తొలుత ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకునేంతవరకు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం మార్కెట్ ధరనే భరించాల్సి ఉంటుంది. బ్యాంక్ సీడింగ్‌లో వెనుకబాటు గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయడంలో పూర్తిగా వెనకబడిపోయింది. ఎల్పీజీ గ్యాస్ డీలర్లు సుమారు 67.5 శాతం కనె క్షన్ల వరకు ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సఫలికృతం కాగా, బ్యాంక్ ఖాతాల అనుసంధానం మాత్రం 41.5 శాతం మించలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీ, రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలోని స్లమ్ ఏరియాలు బ్యాంక్సీడింగ్లో పూర్తిగా వెనకబడినట్లు కనిపిస్తోంది. బ్యాంకర్లు కొత్త ఖాతాల ప్రారంభానికి జీరో డిపాజిట్‌కు వెసులుబాటు కల్పించి ఆదివారం సైతం పనివేళలు కొనసాగించినా.. ఫలితం లేకుండా పోయింది. చివరకు మొబైల్ వాహనాల ద్వారా అవగాహన కూడా కల్పించారు. ఆయినప్పటికీ అనుసంధానంలో మాత్రం గ్యాస్ డీలర్లతో సమానంగా ముందుకు సాగలేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ ఎల్పీజీ కనెక్షన్‌గల సంపన్న కుటుంబాలతో పాటు గల్ఫ్ ఇతర దేశాలకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు సైతం తమ బ్యాంక్ ఖాతాలను ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఇతర పేర్లపై ఎల్పీజీ కనెక్షన్లు గల వినియోగదారులకు ఆధార్కార్డులున్నా అనుసంధానానికి దూరంగా ఉండిపోయారు. స్కూళ్ల ద్వారా కూడా వివరాలు సేకరించాం ఎల్పీజీ ఆధార్‌తో అనుసంధానం కోసం స్కూళ్ల విద్యార్థుల ద్వారా కూడా వివరాలు సేకరించాం. వాటిని అనుసంధానం చేస్తున్నాం. ఫలితంగా ఆధార్ అనుసంధానం మరికొంత పెరిగే అవకాశం ఉంది. - డాక్టర్ పద్మ, సీఆర్వో, హైదరాబాద్ ఇప్పటికైనా అనుసంధానం చేసుకొండి ఇప్పటికైన ఎల్పీజీ వినియోగదారులు తమ కనెక్షన్లను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీకి దూరమవుతారు. రాయితీ లేకుండా మార్కెట్ ధర ప్రకారం గ్యాస్ రీఫిల్లింగ్‌కు నగదు చెల్లించాల్సి ఉంటుంది. - అశోక్, గ్రేటర్ వంట గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షుడు