హైదరాబాద్ : నగరంలోని పెద్దఅంబర్పేట్లో ఆర్టీఏ అధికారులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి పన్ను చెల్లించని 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు గుర్తించి... వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఆర్టీఏ కార్యాలయానికి తరలించి... సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు చూపని మరో 22 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే... నగరం నుంచి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను తరలిస్తున్న 19 కార్లను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. సదరు కార్లకు అనుమతులు లేవని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
నాలుగు బస్సులు.. 19 కార్లు సీజ్
Published Tue, Jun 7 2016 8:22 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement