సికింద్రాబాద్ : వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించిన 60 మంది బాలకార్మికులు ఆదివారం పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గత నెల రెండో వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో వివిధ కార్మాగారాల్లో పనిచేస్తున్న దాదాపు 60 మంది బాలురను పోలీసులు రక్షించారు.
అనంతరం వారిని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.ఆదివారం బిహార్ వెళ్లేందుకు వారిని సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉన్నతాధికారులు వారిని పాట్నా ఎక్స్‌ప్రెస్ ఎక్కించారు.