‘అక్రిడిటేషన్’కు దరఖాస్తుల ఆహ్వానం | Accreditation cards for Telangana Media journalists | Sakshi
Sakshi News home page

‘అక్రిడిటేషన్’కు దరఖాస్తుల ఆహ్వానం

Aug 24 2016 10:27 PM | Updated on Oct 4 2018 8:34 PM

ప్రింట్, ఎలక్టాన్రిక్‌ మీడియా డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు సమర్పించాలని సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ సూచించారు.

హైదరాబాద్‌: ప్రింట్, ఎలక్టాన్రిక్‌ మీడియా డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు సమర్పించాలని వార్తా పత్రికల సంపాదకులు, న్యూస్‌ చానెళ్ల సీఈవో/మేనేజింగ్‌ డైరెక్టర్లకు తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ సూచించారు.

విలేకరులు, ఫొటోగ్రాఫర్లతో పాటు డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్‌–2016’ పేరుతో జీవో 239 జారీ చేసిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం అర్హులైన డెస్క్‌ జర్నలిస్టుల జాబితాను పంపించాలని ప్రింట్, ఎలక్టాన్రిక్‌ మీడియా సంస్థలకు ఆయన లేఖ రాశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement