Telangana Media
-
తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అల్లం నారాయణ వివరంగా ఆంధ్రప్రదేశ్ అకాడమీ చైర్మన్‌కి తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపి, మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రటరీ, నాగులాపల్లి వెంకటేశ్వర రావు, ఇరు అకాడమీల సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ('చంద్రబాబువి పచ్చి అబద్దాలు.. అవి టీడీపీ పుట్టక ముందునుంచే ఉన్నాయి') -
దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ పాల్గొన్నారు. -
ఏడాదిలోపు మీడియా భవనం
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోపు తెలంగాణ మీడియా అకాడమీ భవనం అందుబాటులోకి వస్తుందని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సోమవారం సమాచార భవన్లో నిర్వహించిన అకాడమి పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన నిర్మాణం కోసం ఆర్అండ్బీ ఆధ్వర్యంలో టెండర్లు కూడా ఖరారయ్యాయని చెప్పారు. నూతన భవన శంకుస్థాపన త్వరలో సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభమవుతుందన్నారు. అకాడమీకి రూ.15 కోట్లు మంజూ రు చేశారని తెలిపారు. నూతన అకాడమీ భవనం పూర్తైతే రూ.100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి శాశ్వతతరగతి గదులను నిర్మించి జర్నలిజం కోర్సు కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు. 150 కుటుంబాలకు ఆర్థిక చేయూత గతంలో ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి వంద కోట్లు ప్రకటించి, రూ.34.50 కోట్లను విడుదల చేసిందని అల్లం నారాయణ వివరించారు. మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు వాటి నుంచి రూ.లక్ష చొప్పున రూ.కోటి యాభై లక్షలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున 26 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.3,000 చొప్పున 5 ఏళ్ల వరకు ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 104 మంది పిల్లలకు 1 నుంచి 10వ తరగతి వరకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ పత్రికల ఎడిటర్లు, సీనియర్ పాత్రికేయులు, తెలుగు వర్సిటీ జర్నలిజం శాఖాధిపతి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అక్రిడిటేషన్’కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు సమర్పించాలని వార్తా పత్రికల సంపాదకులు, న్యూస్ చానెళ్ల సీఈవో/మేనేజింగ్ డైరెక్టర్లకు తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. విలేకరులు, ఫొటోగ్రాఫర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2016’ పేరుతో జీవో 239 జారీ చేసిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం అర్హులైన డెస్క్ జర్నలిస్టుల జాబితాను పంపించాలని ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా సంస్థలకు ఆయన లేఖ రాశారు.