మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు | Accreditation cards in three phases | Sakshi
Sakshi News home page

మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు

Published Thu, Jun 25 2015 1:50 AM | Last Updated on Thu, Oct 4 2018 8:34 PM

మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు - Sakshi

మూడు విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ 3 విడతల్లో అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మ న్,  రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మొద టి విడతలో ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులున్న జర్నలిస్టులకు ఈ నెలాఖరులోగా  అందిస్తామ న్నారు. రెండు, మూడో విడత కార్డులను త్వర లో ఇస్తామన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు అనుగుణంగా మూడో విడతలో డెస్క్ జర్నలిస్టులకు కార్డులు ఇస్తా మన్నారు. బుధవారం సమాచార, పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement