అగ్రిగోల్డ్ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా | agrigold case adjourned afternoon | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా

Published Thu, Nov 26 2015 11:50 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

agrigold case adjourned afternoon

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వరుస మీడియా కథనాలతో అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని... అగ్రిగోల్డ్‌ యాజమాన్యం గురువారం న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. అంతేకాకుండా మీడియాలో అగ్రిగోల్డ్‌ వార్తలను అడ్డుకోవాలని కోరింది. ఆ విషయంలో తామేమీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు అగ్రి గోల్డ్‌ యజమానుల బినామీ ఆస్తుల చిట్టాను బాధితులు కోర్టుకు సమర్పించారు. కోర్టు విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. అనంతరం ఈ కేసుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement