
బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం...
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి 180 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. కొద్ది సేపటికే సదరు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విషయాన్ని వెంటనే గుర్తించిన పైలెట్ విమాన్నాన్ని వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపేశాడు.
ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు. సదరు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.