విత్తనాలు, పురుగు మందులూ ఇవ్వాలి | Also Seeds, pesticides should be given | Sakshi
Sakshi News home page

విత్తనాలు, పురుగు మందులూ ఇవ్వాలి

Published Mon, Apr 17 2017 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

విత్తనాలు, పురుగు మందులూ ఇవ్వాలి - Sakshi

విత్తనాలు, పురుగు మందులూ ఇవ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: ఎరువులనే కాకుండా మహారాష్ట్రలో ఇస్తున్నట్టుగా విత్తనాలు, పురుగు మందులు కూడా రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరుస కరువు, ప్రకృతి వైపరీత్యాలు, రుణ సమస్యలు, మార్కెటింగ్‌ సమస్యలు వంటివి ఎన్నో రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.

రైతులకు ఎరువులను మాత్రమే కాకుండా ఉపాధిహామీ కూలీలను రైతులకు అటాచ్‌ చేస్తే కూలీల సమస్య నుండి రైతులకు ఉపశమనం కలుగుతుందన్నారు. అసెంబ్లీలో ఎంతసేపు అయినా చర్చించుకుందామని చెబుతూనే హడావుడిగా, ఆదరా బాదరాగా అసెంబ్లీని వాయిదావేశారని అన్నారు. మిర్చికి గిట్టుబాటు ధరలేక, కొనేవారు లేక రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని చిన్నారెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement