గాడ్సే చేతిలో తుపాకీ బాబు | ambati ram bau fires on chandra babu | Sakshi
Sakshi News home page

గాడ్సే చేతిలో తుపాకీ బాబు

Published Mon, Feb 17 2014 4:05 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

గాడ్సే చేతిలో తుపాకీ బాబు - Sakshi

గాడ్సే చేతిలో తుపాకీ బాబు

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ధ్వజం
 బాబు ఇచ్చిన లేఖనే తూటాగా
 తెలుగుజాతిపైకి ప్రయోగించిన సోనియా
 సమైక్య ముసుగులో సంపాదనే ధ్యేయంగా కిరణ్ పనిచేస్తున్నారు
 వైఎస్సార్‌సీపీపై దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మరు
 
 సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రజల పాలిట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గాడ్సేలా తయారైతే.. ఆమె చేతిలోని తుపాకీగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన విభజన లేఖనే తుపాకీలోని తూటాలా ఉపయోగించుకొని సోనియా తెలుగుజాతిపైకి ప్రయోగించారని ఆరోపించారు. తెలుగుతల్లి రక్తసిక్తమై విలవిల్లాడటానికి ప్రధాన బాధ్యులు సోనియా, చంద్రబాబులే అని నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగర్జన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని అంబటి విమర్శించారు. ఈ ప్రజాగర్జనలోనైనా ‘సమైక్యాంధ్ర’ అంటారేమోనని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే కలిగించారన్నారు. సోనియాగాంధీ ఇటలీ మాఫియా అని ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబుకు తెలిసిందా? అని అంబటి ప్రశ్నించారు.
 
  ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటపడి వేధింపులకు గురిచేసినప్పుడే సోనియా నైజం బయటపడింది. ఇటలీ మాఫియాకు ఎదురొడ్డి నిలబడి, అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టించినా ధైర్యంగా ఆమె ఉక్కుపాదాన్ని ఎదిరించారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం సోనియా మాఫియా చేతిలో కీలు బొమ్మగా మారారు. ఎమ్మార్, ఐఎంజీ తదితర కేసులకు భయపడి మొన్నటి దాకా సెలైంట్‌గా ఉండటమే కాక చివరకు రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లుకు మద్దతిచ్చి, అసెంబ్లీలో అవిశ్వాసం సందర్భంగా కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారు. ఇలా ఇంత కాలం మౌనం దాల్చిన చంద్రబాబు ఇప్పుడు విమర్శల వేగం చేయడానికి గ ల కారణం.. సోనియా అధికారం కోల్పోతున్నారనే ధీమాతోనే’’ అని వివరించారు. ఇంకా అంబటి ఏమన్నారంటే..
 
     కేంద్రం ఆర్టికల్-3ని దుర్వినియోగం చేస్తోందంటున్న చంద్రబాబు వారి ఎంపీలను ఏకతాటిపైకి తెచ్చి పార్లమెంటులో ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? రాష్ట్రం సమైక్యంగా ఉం చడం కోసం టీడీపీ పనిచేస్తోందని ఒక్కమాట కూడా చెప్పలేని చంద్రబాబుకు మరొకరిని నిందించే నైతికహక్కు లేదు.
 
 అనతికాలంలోనే కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రాకుండా దిమ్మతిరిగేలా చేసిన వైఎస్సార్‌సీపీ సైకో పార్టీ ఎలా అవుతుంది బాబూ?
 
     వాస్తవానికి నారా కుటుంబం మొత్తానికి పిచ్చిపట్టే జబ్బు ఉంది. ప్రస్తుతం బాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఎక్కడున్నారు? పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్నది నిజం కాదా? లోకేష్‌కు ఎలాంటి పిచ్చి ఉందో వారి టీచర్‌ను అడిగితే చెబుతారు! వంశపారంపర్యంగా పిచ్చి బాబుకు కూడా సోకినట్లుంది. అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు.
 
     టీడీపీ ఒక హంతకుల పార్టీలా తయారైంది. కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్నప్పుడు వంగవీటి మోహనరంగాను అతిదారుణంగా నడిరోడ్డుపై హతమార్చారు. అలాగే పింగళి దశరథరాం, ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు, మల్లెల బాబ్జి, ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది.
 
     సీఎం కిరణ్ వ్యవహారం రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన మాదిరిగా ఉంది. ఏడు నెలలుగా సమైక్య ముసుగులో సంపాదనే ధ్యేయంగా కిరణ్ పనిచేస్తున్నారు. సీఎం కిరణ్ పెన్నింకుతో జీవోలను సెంచరీలు దాటిస్తున్నారు. కిరణ్ దౌర్భాగ్యమైన పాలనను చంద్రబాబు ప్రశ్నించిన పాపానపోలేదు.
 
     బీజేపీకి మద్దతిస్తామని రాజ్‌నాథ్‌సింగ్‌తో జగన్ చెప్పారని ప్రచారం చేస్తున్నవారేమైనా బల్లకింద దాగుండి విన్నారా?
 
     చంద్రబాబు బినామీలైన రెండు పత్రికలు, నాలుగు చానెళ్లు, కిరణ్, బొత్సలకు ఉన్న బినామీ చానెళ్లు వైఎస్సార్‌సీపీపై ఎంత దుష్ర్పచారం చేసినా ప్రజలు నమ్మరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement