కానిస్టేబుళ్ల నియామకంపై హైకోర్టులో మరో పిల్‌ | Another pill in high court on constables appointment | Sakshi
Sakshi News home page

కానిస్టేబుళ్ల నియామకంపై హైకోర్టులో మరో పిల్‌

Published Wed, Mar 29 2017 1:01 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది.

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. నల్లగొండ జిల్లాకు చెందిన టి.వీర భద్రం మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళ వారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రి యలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించలేదన్నారు. వాదనలు విన్న ధర్మా సనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది.

అక్రమాలు తేలితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం...
ఈ సందర్భంగా రచనారెడ్డి పరోక్షంగా మధ్యంతర ఉత్త ర్వుల కోసం అభ్యర్థించారు. దీనిని అర్థం చేసుకున్న ధర్మా సనం, ఇప్పటికే ఇదే అంశంపై పిల్‌ దాఖలైందని, ఆ వ్యాజ్యంలో ప్రతీ అభ్యర్థి నియామకపు ఉత్తర్వుల్లో వారి నియామకం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశామంది. ఒకవేళ తుది విచారణ సమయంలో ఈ నియామకాల్లో పిటిషనర్లు ఆరోపించినట్లు అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు తేలితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని కూడా పాత వ్యాజ్యంతో జత చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement