కాళేశ్వరానికి ఏపీ మోకాలడ్డు!
ప్రాజెక్టును అపెక్స్ కౌన్సిల్‌కు లాగే యత్నం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుపై కొన్నా ళ్లుగా తెర ముందు కొట్లాడిన ఏపీ.. ఇప్పుడు తెరవెనుక దాన్ని అడ్డుకునే మంత్రాంగం నడుపుతోంది. పర్యావరణ అనుమతులు రాకుండా, వివాదాస్పద ప్రాజెక్టుగా చూపి అపెక్స్ కౌన్సిల్ ముందుకు లాగేలా ప్రయత్నిస్తోంది. దీనికి కృష్ణా బోర్డు, కేంద్ర కమిటీ లోని కొందరు సభ్యులు ఏపీకి సహకరి స్తున్నారని తెలంగాణ అనుమానిస్తోంది.
ప్రాణహిత–చేవెళ్లను విభజించి..
గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల భారీ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ముందుగా చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా విభ జించి దీనికి రూపకల్పన చేశారు. మొత్తంగా 150 టీఎంసీల సామర్థ్యం సమకూ రేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. ఆ రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణా నికి మొత్తం 80వేల ఎకరాల భూమి అవసరం. పాత ప్రాజెక్టుకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులున్న దృష్ట్యా సీడబ్ల్యూసీ నుంచి కొత్తగా అనుమతులు అక్కర్లేదని, కేవలం పర్యావరణ అనుమతులు తీసుకుంటే సరిపోతుందని తెలంగాణ భావించింది.
అధికారుల సహాయంతో ఏపీ కొర్రీలు!
మొదటగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు ఓకే చెప్పిన ఈఏసీ.. తర్వాత తన మినిట్స్‌లో మాత్రం ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యా సాధ్యాలపై ముందుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఈఏసీలోని ఓ సభ్యుడి అభ్యంతరం కారణంగానే పర్యావరణ అనుమతులు ఆగిపోయాయి. ఆ సభ్యుడు ఏపీకి అనుకూ లంగా వ్యహరిస్తున్నారని తెలంగాణ భావిస్తోంది. అదీగాక ఈఏసీ ముందు తెలంగాణ ప్రజెంటేషన్ ఇచ్చాక.. కృష్ణా బోర్డులోని కొందరు అధికారుల సూచన లతో ఏపీ సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
కమిటీలో ప్రాజెక్టు అనుమతులను వ్యతిరే కించిన సభ్యుడే కేంద్రం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆ సభ్యుడికి కాళేశ్వరం అంశాలను వివరించి, ప్రాజెక్టును అడ్డుకునేలా ఏపీ వ్యూహ రచన చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఇక కృష్ణా బోర్డు చైర్మనే గోదావరి బోర్డు కూ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున.. బోర్డులో ని ఏపీకి చెందిన అధికారులు తెలివిగా వ్యవ హరించి వివాదాన్ని గోదావరి బోర్డు ముందుకు వచ్చేలా చేశారనే వాదన వినిపి స్తోంది. బోర్డులో వివాదం పరిష్కారం కాని పక్షంలో కేంద్రమంత్రి, సీఎంల స్థాయిలో ఉన్న అపెక్స్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లాలనే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిం చేందుకు గోదావరి బోర్డు చైర్మన్‌ను సీడబ్ల్యూ సీ ఆహ్వానించింది. అనంతరం 20న మరో మారు బోర్డు సమక్షంలో చర్చించనుంది.