కొద్దిసేపు ప్యానెల్ స్పీకర్‌గా గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి శనివారం స్పీకర్ స్థానం నుంచి ప్యానెల్ స్పీకర్‌గా కొద్దిసేపు సభను నడిపారు. హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఘటనలపై హోంమంత్రి ప్రకటన అనంతరం ఆ అంశంపై చర్చ జరిగింది. అస్వస్థత కారణంగా స్పీకర్ శనివారం అసెంబ్లీకి రాలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి విధులు నిర్వహించారు.
ఆమె భోజన విరామానికి వెళ్లగా స్పీకర్ స్థానంలో గీతారెడ్డి ఉండి కొద్దిసేపు సభను నడిపారు. కాగా, తొలుత ప్యానెల్ స్పీకర్‌గా రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కోరగా తనకంటే సీనియర్ అయిన గీతారెడ్డి పేరును ఆయన సూచించారు. ‘ఆస్థానంలో కూర్చున్న ఎవరైనా సభను ఆర్డర్‌లో పెట్టాల్సిందే. గీతారెడ్డి కూడా అదేపని చేశారు. ఆ కుర్చీకి ఉన్న పవర్ అది’ అని అసెంబ్లీ అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.