అర్ధరాత్రి మధుప్రియ ఇంటిపై దాడి | attack on madhupriya house | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మధుప్రియ ఇంటిపై దాడి

Published Sun, Mar 13 2016 7:22 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

అర్ధరాత్రి మధుప్రియ ఇంటిపై దాడి

అర్ధరాత్రి మధుప్రియ ఇంటిపై దాడి

హైదరాబాద్: గాయని మధుప్రియ ఇంటిపై శనివారం అర్ధరాత్రి దాడి జరిగింది. మధుప్రియ భర్త శ్రీకాంత్, అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడికి పాల్పడ్డట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్ధరాత్రి ఉప్పల్ లోని తమ ఇంటికి వచ్చిన శ్రీకాంత్.. వేధింపుల కేసు ఎందుకు పెట్టారంటూ నానా హంగామా సృష్టంచాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టే ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్ అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

పెళ్లైన మూడు నెలల నుంచే ఆస్తి కోసం తనను వేధిస్తున్నాడని, ఆ క్రమంలో చిత్రహింసలకు గురిచేశాడని భర్త శ్రీకాంత్ పై మధుప్రియ శనివారం పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకుని తాను తప్పుచేశానని, పెద్దల మాట వినకపోతే జీవితం నాశనం అవుతుందని ఆమె ఫిర్యాదు సందర్భంగా మాట్లాడిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement