విద్యా సంస్థలపై దాడులా?: నారాయణ | Attacks on educational institutions? : Narayana | Sakshi
Sakshi News home page

విద్యా సంస్థలపై దాడులా?: నారాయణ

Published Wed, Apr 20 2016 12:49 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

Attacks on educational institutions? : Narayana

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థలపై పోలీసుల దాడులు నిలిపివేయాలని సీపీఐ నేత కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. బోగస్ కాలేజీలు, స్కాలర్‌షిప్‌లు, అటెం డెన్స్ పేరుతో విద్యాసంస్థల్లో భయానక వాతావరణం కల్పిస్తున్నారని మంగళవా రం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్యా సంస్థల తనిఖీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించి విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లోకి పోలీసులు ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులు, విద్యావ్యవస్థను ఒకేగాటన కట్టి కర్ర పెత్తనం చేయడం సమంజసం కాదని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement