సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాల(ఆరో సెషన్) నిర్వహణపై చర్చించేందుకు బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) గురువారం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ప్రతిపక్షాలు 15 రోజలైనా సమావేశాలు ఉండాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ, మండలి ఎన్ని రోజులు నడవాలన్న అంశంపై బీఏసీలో స్పష్టత రానుంది. దీంతోపాటు ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు, సెలవు రోజులు, మొత్తం పనిదినాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది.
నేడు బీఏసీ సమావేశం
Published Thu, Dec 15 2016 4:50 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
Advertisement
Advertisement