బావమరిదిని చంపి..బావ ఆత్మహత్యq | Bavamaridini killing her suicide | Sakshi
Sakshi News home page

బావమరిదిని చంపి..బావ ఆత్మహత్య

Published Sun, Jan 12 2014 4:10 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Bavamaridini killing her suicide

  •      తాగిన మైకంలో గొడవపడి..
  •      జవహర్‌నగర్‌లో ఘటన
  •      కుటుంబకలహాలే కారణం?
  •  
    జవహర్‌నగర్/అల్వాల్, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలు ఇద్దరిని బలిగొన్నాయి. బావమరిదిని చంపి, బావ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘ టన జవహర్‌నగర్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుల కు టుంబసభ్యుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా  బేగంపేట గ్రామానికి చెందిన కుమ్మరి న ర్సింహులు కుమారుడు యాదగిరి (24)కి అదే గ్రామానికి మేనమామ ఆకుల రాములు కు మార్తె నవనీతతో గతేడాది ఏప్రిల్ 15న పెళ్లైంది. కట్నం కింద నాలుగు తులాల బంగా రం, రూ. 50 వేలు ఇచ్చారు.

    యాదగిరి ఆరు నెలల క్రితం భార్యను తీసుకొని జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. జవహర్‌నగర్‌లో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. పెద్దలు ఇద్దరికీ సర్ధిచెప్పేవారు. యాదగిరి మామ రాములు ఈసీఐఎల్‌లోని గాయత్రినగర్‌లో వా చ్‌మన్‌గా పని చేస్తున్నాడు. భర్తతో మళ్లీ గొడవ జరగడంతో కొద్ది రోజుల క్రితం నవనీత గాయత్రినగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త కాపురానికి రమ్మని కోరినా ఆమె ససేమిరా అనేది. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తింటివారే కారణమని యాదగిరి భా వించేవాడు.

    ఇదిలా ఉండగా...యాదగిరి  శుక్రవారం రాత్రి గాయత్రినగర్‌లోని మామ ఇంటికి వెళ్లాడు. అక్కడ భోజనం చేసి, బావమరిది శ్రీకాంత్ (18)ను వెంటబెట్టుకొని జవహర్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మ ద్యం (బీరు) తాగారు. ఈ నేపథ్యంలో ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటా మాట పెరిగిం ది. యాదగిరి అక్కడే ఉన్న సెంట్రింగ్ రాడ్‌తో శ్రీకాంత్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ త ర్వాత లుంగీతో ఇంటి పైకప్పు రాడ్‌కు ఉరేసుకొని యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడు.

    శని వారం ఉదయం శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందనలేదు. దీంతో వారు నేరుగా వచ్చి చూడగా ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు అల్వాల్ ఏసీపీ ప్రకాశరావు, ఎస్‌ఐ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణాలు జరిగి ఉంటాయని  పోలీసులు భా విస్తున్నారు. అయితే, మృతుడు శ్రీకాంత్ చేతి లో యాదగిరికి చెందిన బంగారు గొలుసు ఉం డటంతో దాని గురించి  గొడవ జరిగి ఉంటుం దా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

    మిన్నంటిన రోదనలు...

    శ్రీకాంత్ హత్య, యాదగిరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి అతని తల్లి కంషవ్వ సొమ్మసిల్లి పడిపోయింది. ఇద్దరి కుటుంబసభ్యుల రోదనలు చూసి కాలనీవాసులు కంటతడిపెట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement