Marie
-
రెండుసార్లు నోబెల్ పొందిన ఏకైక మహిళ
ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది. ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. 1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె. ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. -
పని చేస్తున్న ఇంటికే కన్నం..
కేపీహెచ్‌బీ కాలనీ: తాను పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ. నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. మంగళవారం సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ కాలనీలోని ఇందూ ఫారŠూచ్యన్ ఫీల్డ్స్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల మేరీ (40) పని చేస్తూ అక్కడే సర్వెంట్ క్వార్టర్లో ఉంటోంది. కొద్ది రోజులుగా ఓ బాలిక కూడా ఈమెతో పాటు పని చేస్తూ అదే క్వార్టర్లో ఉంటోంది. శ్రీకాంత్‌రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బును బెడ్రూంలోని కబోర్డులో దాచి పెట్టడం చూసిన వీరు పలుమార్లు కొద్ది కొద్దిగా మొత్తం రూ. 5 లక్షలు దొంగిలించారు. అంతేకాకుండా బంగారు గాజులు, రెండు బంగారు రింగులను కూడా అపహరించారు. దొంగిలించిన డబ్బుతో కొంత బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే బంగారు ఆభరణాలు పోయిన విషయమై మూడు రోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డి పని మనిషిని ప్రశ్నించగా తాను తీయలేదని చెప్పింది. అంతేకాకుండా సర్వెంట్ క్వార్టర్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి మేరీని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ. 1.7 లక్షల నగదు, 59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మేరీతో పాటు పని చేసిన మరో బాలికకు జువైనల్ చట్టం కింద నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బావమరిదిని చంపి..బావ ఆత్మహత్యq
తాగిన మైకంలో గొడవపడి.. జవహర్‌నగర్‌లో ఘటన కుటుంబకలహాలే కారణం? జవహర్‌నగర్/అల్వాల్, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలు ఇద్దరిని బలిగొన్నాయి. బావమరిదిని చంపి, బావ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘ టన జవహర్‌నగర్ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుల కు టుంబసభ్యుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా బేగంపేట గ్రామానికి చెందిన కుమ్మరి న ర్సింహులు కుమారుడు యాదగిరి (24)కి అదే గ్రామానికి మేనమామ ఆకుల రాములు కు మార్తె నవనీతతో గతేడాది ఏప్రిల్ 15న పెళ్లైంది. కట్నం కింద నాలుగు తులాల బంగా రం, రూ. 50 వేలు ఇచ్చారు. యాదగిరి ఆరు నెలల క్రితం భార్యను తీసుకొని జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. జవహర్‌నగర్‌లో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. పెద్దలు ఇద్దరికీ సర్ధిచెప్పేవారు. యాదగిరి మామ రాములు ఈసీఐఎల్‌లోని గాయత్రినగర్‌లో వా చ్మన్గా పని చేస్తున్నాడు. భర్తతో మళ్లీ గొడవ జరగడంతో కొద్ది రోజుల క్రితం నవనీత గాయత్రినగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త కాపురానికి రమ్మని కోరినా ఆమె ససేమిరా అనేది. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తింటివారే కారణమని యాదగిరి భా వించేవాడు. ఇదిలా ఉండగా...యాదగిరి శుక్రవారం రాత్రి గాయత్రినగర్‌లోని మామ ఇంటికి వెళ్లాడు. అక్కడ భోజనం చేసి, బావమరిది శ్రీకాంత్ (18)ను వెంటబెట్టుకొని జవహర్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మ ద్యం (బీరు) తాగారు. ఈ నేపథ్యంలో ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటా మాట పెరిగిం ది. యాదగిరి అక్కడే ఉన్న సెంట్రింగ్ రాడ్‌తో శ్రీకాంత్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ త ర్వాత లుంగీతో ఇంటి పైకప్పు రాడ్‌కు ఉరేసుకొని యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడు. శని వారం ఉదయం శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందనలేదు. దీంతో వారు నేరుగా వచ్చి చూడగా ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు అల్వాల్ ఏసీపీ ప్రకాశరావు, ఎస్ఐ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణాలు జరిగి ఉంటాయని పోలీసులు భా విస్తున్నారు. అయితే, మృతుడు శ్రీకాంత్ చేతి లో యాదగిరికి చెందిన బంగారు గొలుసు ఉం డటంతో దాని గురించి గొడవ జరిగి ఉంటుం దా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు... శ్రీకాంత్ హత్య, యాదగిరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి అతని తల్లి కంషవ్వ సొమ్మసిల్లి పడిపోయింది. ఇద్దరి కుటుంబసభ్యుల రోదనలు చూసి కాలనీవాసులు కంటతడిపెట్టారు.