టెలీమెడిసిన్‌తో ఉత్తమ వైద్యం | Best therapy with Telemedicine | Sakshi
Sakshi News home page

టెలీమెడిసిన్‌తో ఉత్తమ వైద్యం

Published Sun, Jan 8 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

టెలీమెడిసిన్‌తో ఉత్తమ వైద్యం

టెలీమెడిసిన్‌తో ఉత్తమ వైద్యం

సదస్సులో వైద్య నిపుణుల ఆశాభావం

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ వైద్య సేవల్లో టెలీమెడిసిన్‌ కీలకంగా మారబోతోందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు  మెరుగైన వైద్యం అందజేసే అవకాశం ఉందన్నారు. గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషి యన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (ఈఏ పీఐఓ) 7వ వార్షిక సదస్సు శనివారం పార్క్‌హ యత్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశంతో పాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ల నుంచి సుమారు 70 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు.

ఈఏపీఐఓ అధ్యక్షుడు డాక్టర్‌ శంఖు సురేందర్‌రావు, ఎలక్టివ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రమేశ్‌ మెహతా, ఎలక్టివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అనుపమ్‌ సిబల్, కోశాధికారి డాక్టర్‌ సుధీర్‌ బారీక్, ప్రధాన కార్యదర్శి నందకు మార్‌ జయరామ్, డాక్టర్‌ అమితవ్‌ బెనర్జీ, డాక్టర్‌ నీరజ్‌ భల్లా, డాక్టర్‌ సురేంద్ర కె.వర్మ, డాక్టర్‌ అరుణ్‌ జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, హైపర్‌టెన్షన్, కేన్సర్‌ వంటి జబ్బులు పెరుగుతున్నాయన్నారు. టెలీమెడిసిన్‌ ప్రవేశంతో ఈ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే టెలీమెడిసిన్‌  అందుబాటులోకి వస్తుం దన్నారు.

ఈ సందర్భంగా వరల్డ్‌ హెల్త్‌కేర్‌ ఇన్నోవేటివ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది 2017 అవార్డును ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్‌ నవాబ్‌ షఫీ ఉల్‌ముల్క్‌కు అందజేశారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో ఈ టెలీ మెడిసిన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్‌ ద్వారకానాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement