Telemedicine
-
టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా సేవలు.. ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ ఫేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
టెలీమెడిసిన్ సేవల్లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటికి చేరువలోనే వైద్య సేవల కల్పనలో సీఎం జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య శాఖలో పలు సంస్కరణలు తె చ్చింది. పీహెచ్‌సీల నుంచి జిల్లా ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రులను అధునాతనంగా తీర్చి దిద్దుతోంది. ప్రజలకు అత్యంత అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్యులనే గ్రామాలకు పంపి, ప్రజల ముంగిటకే వైద్య సేవలను తీసుకెళ్లింది. టెలీమెడిసిన్లోనూ అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందించడంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలను 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ విధానంలో ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల ద్వారా అత్యంత వేగంగా, సమర్ధవంతమైన సేవలు అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తోంది. ఏపీ స్థానాన్ని మరే రాష్ట్రం అధిగమించలేకపోతోంది. నాలుగో వంతు ఏపీ నుంచే 2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా, వీటిలో 25 శాతం ఒక్క ఏపీ నుంచే ఉన్నాయి. ఏపీ 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. 2.60 కోట్లతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. మన రాష్ట్రం నుంచి సగటున రోజుకు 70 వేల కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 1.64 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులు రాష్ట్రంలో టెలిమెడిసిన్ సేవలు అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను చేసింది. ఈ హబ్‌లకు పీహెచ్‌సీలు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ప్రతి హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ స్పెషలిస్ట్ వైద్యులతో పాటు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమున్న సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స చేస్తున్నారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు మందులు సూచిస్తారు. ఆ మందులను పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. -
టెలి మెడిసిన్ లో దేశంలోనే ఏపీ టాప్
-
టెలీమెడిసిన్ సేవల్లో రికార్డు సృష్టించిన ఏపీ
-
Andhra Pradesh: టెలీమెడిసిన్‌లో అగ్రగామి ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి వెనువెంటనే నాణ్యమైన వైద్య సేవలందించాలన్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం టెలీమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేశారు. ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో టెలీమెడిసిన్ సేవల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. టెలీమెడిసిన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరుకి దేశవ్యాప్తంగా 6.03 కోట్ల మంది రోగులకు టెలీమెడిసిన్ సేవలందిస్తే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1.86 కోట్ల మంది రోగులకు ఈ సేవలందినట్లు ఆ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. అంటే దేశం మొత్తం అందించిన టెలీమెడిసిన్ సేవల్లో 30.84 శాతం ఒక్క ఏపీలోనే అందించినట్లు. పశ్చిమబెంగాల్లో 86.69 లక్షల మందికి, తమిళనాడులో 67.22 లక్షల మందికి ఈ సేవలందించినట్లు పేర్కొంది. అత్యున్నతం.. ఏపీ టెలీమెడిసిన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టెలీమెడిసిన్ విధానాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోగులకు స్పెషలిస్టు సేవలు అందుతున్నాయి. హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు. పీహెచ్‌సీలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. వైద్యులు ఆడియో, వీడియో కాల్లో రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. ఏ మందులు వాడాలో కూడా సూచిస్తారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు, మరో వైపు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ –సంజీవని (ఓపీడీ)యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్య సేవలను పొందుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 42వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. దీంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలీమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. ప్రసూతి వేళ అందిన సేవలు మరువలేనివి నాకు ప్రసూతి వేళలో టెలీమెడిసిన్ విధానంలో అందిన సేవలు మరువలేనివి. స్థానిక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ సింగంపల్లి సంధ్య ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఆమె నేరుగా వీడియోకాల్ ద్వారా గైనకాలజిస్టును అనుసంధానం చేసేవారు. గైనకాలజిస్టు నిండిన నెలల ఆధారంగా నాకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు సూచించేవారు. తీసుకోవలసిన ఆహారం, వేసుకోవలసిన మందులు చెప్పేవారు. పరీక్షల కోసం ఎంఎల్‌హెచ్‌పీ స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్ళేవారు. టెలీమెడిసిన్ సహకారంతో డిసెంబర్లో పండంటి ఆడ శిశువును కన్నాను. మాది మధ్య తరగతి కుటుంబం. కార్పొరేట్ వైద్యాన్ని భరించే స్థోమత లేదు. టెలీమెడిసిన్ ద్వారా అంతకుమించిన నాణ్యమైన వైద్యాన్ని అందుకున్నాను. ఈ సేవలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. –కుడుపూడి నాగశ్రీ, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్ -
టెలిమెడిసిన్ సేవల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. దేశంలో టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయ ఆసియా రీజియన్ ఆధ్వర్యాన ఢిల్లీలో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ చౌహాన్ మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా టెలిమెడిసిన్ సేవలను అమలు చేస్తున్నామని తెలిపారు. టెలిమెడిసిన్ సేవలకు కరోనా కష్టకాలంలో అత్యంత ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు టెలిమెడిసిన్ సేవలను విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో 27 టెలిమెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేశామని, రోజుకు 60వేల టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.7 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదు కాగా, ఇందులో 3.1కోట్లు (32 శాతం) ఏపీలోనే నమోదయ్యాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థంగా నడపాలని సీఎం వైఎస్ జగన్ సూచించారన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టి అందులో 6,145 మంది డాక్టర్లను రిజిస్టర్ చేయడం ద్వారా అప్పట్లో ప్రజలకు విశేష సేవలు అందించామన్నారు. ఈ డాక్టర్లు 13,74,698 కాల్స్ స్వీకరించి సేవలు అందజేశారన్నారు. -
మార్గదర్శకాలతోనే టెలీమెడిసిన్ అమలు
సనత్‌నగర్ (హైదరాబాద్): రోగులకు టెలీ మెడిసిన్ విధానం సులభతరమై నప్పటికీ ఆ విధానంలో నిర్దిష్ట మార్గదర్శకాలు తప్పనిసరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.నందా స్పష్టం చేశారు. టెలీమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా (టీఎస్ఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని లక్ష్మీబిల్డింగ్స్లో సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన టీఎస్ఐ సేవల ప్రారంభ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా టెలీ మెడిసిన్ ద్వారా పలు రాష్ట్రాల్లో చికిత్స పొంది మృతి చెందిన వారి వివరాలను ఉదహరిస్తూ.. ఆ విధానంలో నిబంధనలు, పాలసీలను మరింతగా పటిష్టం చేయాలని కోరారు. వైద్య విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే టెలీ మెడిసిన్ కోర్సులు కూడా తీసుకురావలసిన అవసరం ఉందని సూచించారు. టీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు డీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ 14 రాష్ట్రాల్లో టీఎస్ఐ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, టీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు పీకే ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ రికార్డు..
సాక్షి, అమరావతి: టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్ల మైలురాయిని దాటిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా సోమవారం 2,04,858 కన్సల్టేషన్లు నమోదవగా ఇందులో 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఏపీలోనే నమోదయ్యాయి. తమిళనాడు నుంచి 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణలో 5,574, కేరళలో 543 చొప్పున నమోదయ్యాయి. వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ–సంజీవని టెలీమెడిసిన్ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ప్రజారోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కార్యక్రమం అమలులో తొలినుంచీ దూకుడుగా ముందుకెళ్తోంది. చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని అమలుచేస్తూ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకెళ్తోంది. 27 హబ్‌ల ద్వారా సేవలు టెలీమెడిసిన్ సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలు, 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 5,206 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉంటారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌కు వచ్చిన రోగులు స్పెషాలిటీ వైద్యుల సేవలు కోరితే వెంటనే వైద్య సిబ్బంది టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ తెలియజేస్తారు. అందులో సూచించిన మందులను పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. మరోవైపు.. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచి వైద్య సేవలు పొందుతున్నారు. ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఫోన్‌లేని, వాటి వాడకం రాని వారికి ఇళ్లవద్దే ఈ–సంజీవని ఓపీడీ (ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్) సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. వీటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. వీరు స్మార్ట్ఫోన్లేని, వాటి వాడకం రాని వారికి టెలీమెడిసిన్ సేవలు అందించడంతో పాటు, ప్రజలకు టెలీమెడిసిన్ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం కన్సల్టేషన్లలో 47.34 శాతం ఏపీ నుంచే.. టెలీమెడిసిన్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,00,40,925 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 47.34 శాతం 1,89,59,021 ఏపీ నుంచి ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో టెలీమెడిసిన్ సేవలను ఇంత సమర్థవంతంగా అమలుచేస్తుండటంతో ఇప్పటికే పలుమార్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోనే మొదటి ర్యాంకును సైతం ప్రదానం చేసింది. -
టెలీమెడిసిన్ సేవల్లో నంబర్‌వన్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: టెలీమెడిసిన్ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజారోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ ఏడాది ఆఖరు నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది. దీనికి ముందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘నాడు–నేడు’ కింద ఆరోగ్య ఉపకేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లుగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా పీహెచ్‌సీల్లోనూ వసతుల కల్పన చేపట్టింది. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6,313 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. వంద శాతం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కాకముందు వాటిలో కేవలం ప్రాథమిక వైద్యసేవలను మాత్రమే అందించేవారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మారాక పలు వ్యాధులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణతోపాటు వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్‌సీల్లో సమగ్ర మాతా–శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి సేవలు, మానసిక వైద్యసేవలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి, చెవి, ముక్కు, గొంతు సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ నుంచే 43.01 శాతం కన్సల్టేషన్లు కేంద్రం 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో టెలీమెడిసిన్ సేవలు అందించడం కోసం ఇంతకుముందున్న 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13 హబ్‌లను ఏర్పాటు చేసింది. అనంతరం మరో 14 హబ్‌లతో ఈ సేవలు విస్తరించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 27 హబ్‌లలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష కన్సల్టేషన్లు నమోదవుతుంటే అందులో 50 నుంచి 60 శాతం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆశా వర్కర్ల ద్వారా టెలీమెడిసిన్ సేవలపై అవగాహన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను టెలీమెడిసిన్ హబ్‌లకు అనుసంధానం చేశారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటి నుంచే టెలీమెడిసిన్ సేవలు పొందేందుకు వీలుగా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలీమెడిసిన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు స్మార్ట్ ఫోన్ లేనివారు, వాడకం తెలియనివారు, వృద్ధులు, ఇతరులకు వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంజీవని ఓపీడీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలో 42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. స్మార్ట్ ఫోన్లన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. ఆశాల ద్వారా ప్రజలకు మరింతగా టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. -
టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: టెలీ మెడిసిన్ సేవల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీ మెడిసిన్ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో 13 హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలతో పాటు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటినుంచే టెలీ మెడిసిన్ సేవలు పొందేలా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోజువారీగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి టెలీ మెడిసిన్‌కు వస్తున్న కన్సల్టేషన్లలో అత్యధిక శాతం ఏపీవే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచినట్టు ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. 42 శాతం ఏపీ నుంచే.. టెలీ మెడిసిన్ సేవలు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు దేశ వ్యాప్తంగా 2,43,00,635 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. వీటిలో 42 శాతం అంటే 1,02,03,821 ఏపీ నుంచి నమోదై రికార్డు సృష్టించాయి. 37,70,241 కన్సల్టేషన్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం రోజుకు 75 వేల వరకూ కన్సల్టేషన్లు ఉంటున్నాయి. ఈ–సంజీవని ఓపీడీ యాప్‌ను రాష్ట్రంలో ఇప్పటికే 85,351 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ సంజీవని సేవలపై స్మార్ట్ ఫోన్లు వినియోగించడం తెలియని, స్మార్ట్ ఫోన్లు లేనివారిలో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించింది. త్వరలో ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను మరింత చేరువ చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగా మరో 14 చోట్ల.. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 13 టెలీ మెడిసిన్ హబ్స్‌తో ప్రభుత్వం సేవలు అందిస్తోంది. వీటిని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రూ.5 కోట్లకు పైగా నిధులతో కొత్తగా మరో 14 చోట్ల హబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే 7 హబ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్‌లు ఉంటారు. రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు లక్ష్యంగా.. టెలీ మెడిసిన్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి రోజుకు 2 లక్షల కన్సల్టేషన్లకు చేరుకుంటాం. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 5 లక్షల కన్సల్టేషన్లు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో సగటున మూడుసార్లు టెలీ మెడిసిన్ సేవలు పొందుతారు. – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ -
పాడి కోసం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: అన్నివేళలా అన్నదాతలకు అండగా నిలిచేందుకు గన్నవరంలోని ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ మాదిరిగానే పాడి రైతుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మూగజీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో రూ.7.53 కోట్లతో దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న ఈ కాల్‌సెంటర్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ద్వారా పాడిరైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
-
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ షురూ
న్యూఢిల్లీ: దేశ పౌరుల ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించనుంది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక చర్యలకు నడుం బిగించామని డిజిటల్ మిషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. డిజిటల్ మిషన్‌లో భాగంగా పౌరులకు డిజిటల్ హెల్త్ ఐడీ కార్డును జారీచేయనున్నారు. గతంలో పోల్చితే సాంకేతికతను ఆరోగ్యరంగానికి మరింతగా జోడించడంతో సత్వర వైద్యసేవలు పెరిగాయని మోదీ అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై) మూడో వార్షికోత్సవం రోజునే ఈ కార్యక్రమం మొదలవడం విశేషం. పీఎంజేఏవై కింద పేదలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. పీఎంజేఏవై కింద 2 కోట్ల మంది ఇప్పటికే ఉచితంగా పలు వ్యాధులకు చికిత్స తీసుకున్నారని మోదీ చెప్పారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డుతో ప్రయోజనాలు.. వ్యక్తి ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 14 అంకెలు ఉండే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫికేషన్(ఐడీ) నంబర్ కేటాయిస్తారు. ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, గత మెడికల్ రిపోర్టులు, కుటుంబ వివరాలు, ఉండే ప్రాంతం, చిరునామా తదితరాలను తీసుకుంటారు. కార్డులో పౌరుల ఆరోగ్య చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. వ్యక్తికి హఠాత్తుగా ఆరోగ్య సమస్య ఎదురైతే తోడుగా ఆస్పత్రికి హెల్త్ కార్డు తీసుకెళ్తే హెల్త్ హిస్టరీ సాయంతో సరైన చికిత్స సకాలంలో పొందే అవకాశాలు బాగా మెరుగుపడతాయి. దీంతో వేరే ప్రాంతాల, వేరే రాష్ట్రాల పౌరులకూ చికిత్స చేయడం అక్కడి వైద్యులకు సులభం అవుతుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరం. ఖాతా వివరాలను ఒక మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానిస్తారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్ రిజిస్ట్రీస్‌గా దీనిని పిలుస్తారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఏ) తరహాలో యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(యూహెచ్ఐ)ను ఈ వ్యవస్థలో వాడనున్నారు. వైద్యులు, వైద్యశాలలు, డయాగ్నస్టిక్ ల్యాబ్, ఫార్మసీలు యూహెచ్ఐ ద్వారా రోగుల గత రిపోర్ట్‌లను తీసుకుంటాయి. తద్వారా సత్వర వైద్య సేవలు అందిస్తాయి. దేశంలో ఎంత మంది ఏ విధమైన వ్యాధులతో బాధపడుతున్నారో తెలిస్తే.. ప్రభుత్వం సైతం తగు విధంగా విధానపర ‘ఆరోగ్య’ నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టెలీ మెడిసన్ వంటి సదుపాయాలు ఈ హెల్త్ కార్డు ద్వారా సులభంగా పొందొచ్చు. దీంతో టెలీ మెడిసిన్ వ్యవస్థ మరింతగా విస్తరించనుంది. -
‘ఈ–సంజీవని’లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలీ మెడిసిన్ సేవ ఈ–సంజీవనిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని సేవలకు సంబంధించి 1.2 కోట్ల సంప్రదింపులు పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్..ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్– హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (ఏబీ–హెచ్డబ్ల్యూసీ), ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలు కలిపి 37,04,258 సంప్రదింపులతో తొలిస్థానంలో నిలిచిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 వేల హబ్‌లు, 28 వేల స్పోక్‌లను ఏర్పాటు చేసింది. ఏపీ తరువాత ఈ–సంజీవని అందించిన రాష్ట్రాల్లో కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్ (13,28,889), గుజరాత్ (4,60,326), మధ్యప్రదేశ్ (4,28,544), బిహార్ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. -
నిబంధనలు పట్టవు.. అనుమతులు ఉండవు
సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి ఒక కాంట్రాక్టు ఉద్యోగిని తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలుంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, మార్కులు ఇలా అనేక నిబంధనలను సంతృప్తిపరిస్తేనే ఉద్యోగం దక్కుతుంది. అలాంటిది వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఒక ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించేటప్పుడు ఎన్ని నిబంధనలు ఉండాలి.!?.. అలాంటిది ఈ నిబంధనలన్నింటిని తోసిరాజని ఆరోగ్య ఉప కేంద్రాల్లో టెలి మెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేసే ప్రాజెక్టును గత చంద్రబాబు ప్రభుత్వం ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు కట్టబెట్టేసింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సినదాన్ని గోప్యంగా ముగించేసింది. అంతేకాకుండా సచివాలయంలో దీనికి సంబంధించిన ఫైళ్లు కూడా లేకుండా చేయడం వెనుక మతలబు ఏమిటో ఇట్టే తెలుసుకోవచ్చు. గత టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు కొందరు దీని వెనుక ఉండబట్టే ఇంతగా బరితెగించేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సచివాలయంలో చిన్న ఆధారం కూడా దొరకకుండా చేశారంటే గత టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తమ అవినీతి బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నోట్ ఫైల్ లేకుండానే ఒప్పందం ఏదైనా ప్రాజెక్టుకు ఎంవోయూ (అవగాహన ఒప్పందం) చేసుకునే ముందు నోట్ ఫైల్ రాస్తారు. ఇందులో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతోపాటు ఈ ప్రాజెక్టు ఎందుకు.. దేని కోసం ఉద్దేశించింది.. ప్రాజెక్టు వ్యయం ఇలా పలు విషయాలను నోట్ ఫైల్లో క్రోడీకరిస్తారు. అవగాహన ఒప్పందానికి ఇది కీలకమైన సమాచార ఫైల్‌గా భావిస్తారు. కానీ ఇ–సబ్ సెంటర్లలో హబ్‌ల ఏర్పాటుకు ఎంవోయూ చేసుకునే సమయంలో కనీసం నోట్ ఫైల్ కూడా పెట్టలేదు. తాజాగా దీనికి సంబంధించిన ఫైళ్లపై ఆరా తీయగా సచివాలయంలో సైతం కనీసం ఒక్క ఫైలు కూడా లేదు. కుటుంబ సంక్షేమ శాఖలో సైతం ఎలాంటి ఫైళ్లూ లేకుండానే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. కింది స్థాయి అధికారులతోనే తతంగమంతా.. వైద్య ఆరోగ్యశాఖలో ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలంటే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి లేదా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ల సంతకాలు తప్పనిసరి. కానీ టెలి హబ్ ప్రాజెక్టుకు సంబంధించి కింది స్థాయి అధికారుల సంతకాలతోనే టీడీపీ ప్రభుత్వ ముఖ్యులు తతంగమంతా నడిపించేశారు. ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని అప్పటి ప్రజారోగ్య సంచాలకులతో చేయించారు. ఎల్వోఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)పై మరో జాయింట్ డైరెక్టర్‌తో సంతకం పెట్టించారు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఒకరే ఉన్నారు. కానీ ఆ అధికారి ఎక్కడా సంతకాలు చేయకుండానే కింది స్థాయి అధికారులతోనే చక్రం తిప్పేశారు. విచారణ చేపట్టిన ప్రభుత్వం టెలి మెడిసిన్ హబ్‌ల మీద వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అవగాహన ఒప్పందం, లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లపై సంతకాలు చేసిన ఇద్దరు అధికారులను ప్రశ్నించింది. ఈ ఇద్దరు అధికారులు కూడా అప్పటి ముఖ్య కార్యదర్శి మౌఖిక ఆదేశాల మేరకే సంతకాలు చేశామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరిలో ఒకరు పదవీ విరమణ చేయగా, మరొకరు వైద్య ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ముందు ఒప్పందం.. తర్వాత జీవోనా? ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదు. ముందుగా ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఆ తర్వాత జీవో ఇచ్చారు. 2019 జనవరి 12న ధనుష్ సంస్థకు ఇస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. జీవో మాత్రం ఫిబ్రవరి 15 ఇచ్చారు. ఇందులో కూడా ప్రైవేటుకు ఇస్తున్నట్టు, టెండర్లు పిలవాలని ఎక్కడా లేదు. నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యాధికారుల ద్వారా టెలి మెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వమే చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. కానీ అంతకుముందే ధనుష్ ఇన్ఫోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్టును కట్టబెట్టేశారు. అవినీతి విశ్వరూపం.. ► ఆరోగ్య ఉప కేంద్రాలను ఎలక్ట్రానిక్ సబ్ సెంటర్లుగా ఉన్నతీకరిస్తున్నామని మాత్రమే కేబినెట్ నోట్లో పెట్టారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఇస్తున్నట్టు గానీ, అంచనా ఎంత అవుతుందని గానీ చెప్పలేదు. ► ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పరిపాలనా అనుమతులు లేవు. ► జీవో నంబర్ 39లో కూడా ఈ ప్రాజెక్టును కేవలం ప్రభుత్వ వైద్యాధికారుల ద్వారానే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రైవేటుకు ఇస్తున్నట్టు చెప్పలేదు. ► ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థకు బిల్లులు చెల్లించాలని సచివాలయానికి ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో ఏ జీవో నంబర్ ద్వారా టెండరు ఇచ్చారో పేర్కొనాల్సి ఉండగా అలా ఏమీ చేయలేదు. -
ఎయిమ్స్‌లో ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–ఎయిమ్స్)లో శనివారం నుంచి ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు. సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్ నంబర్ 9494908320, చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407, జనరల్ మెడిసిన్ 9494908526, జనరల్ సర్జరీ 9494901428, ప్రసూతి స్త్రీల విభాగం 9494907302, చిన్న పిల్లల విభాగం 9494902674, దంత వైద్య విభాగం 9494907082, నేత్ర వైద్య విభాగం 9494905811, చర్మవ్యాధుల విభాగం 9494908401, మానసిక వైద్య విభాగం 9494730332, విచారణకు 94939065718/8523007940 ఫోన్ నంబర్లలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వైద్యసేవలను అందుకోవచ్చన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్ద నుంచే టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందుకుని సహకరించాలని కోరారు. -
సీహెచ్సీల్లోనూ ఆక్సిజన్ బెడ్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారి కోసం సీహెచ్‌సీ స్థాయిలోనే 5–10 బెడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఒకస్థాయి కేసులకు సీహెచ్‌సీలోనే వైద్యం అందించాలని, పరిస్థితి విషమిస్తే కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆస్పత్రులు, కోవిడ్ సెంటర్లలో భోజనం, పారిశుధ్యంపై ఆరా ► వైద్యం, మందులు, పారిశుధ్యం, భోజనం.. తదితర అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ► డాక్టర్ వైఎస్సార్ టెలీమెడిసిన్ ద్వారా మందులు పొందిన వారికి ఫోన్‌చేసి సేవల గురించి అడిగి తెలుసుకోవాలి. ► వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా అనే దానిపై అధికారులు పర్యవేక్షించాలి. లోపాలను సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. ► అధికారులు స్పందిస్తూ.. మెనూ కచ్చితంగా అమలుచేసేలా చూస్తున్నామని.. దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందని వివరించారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌పై కూడా శ్రద్ధపెట్టామని చెప్పారు. ► అలాగే, సీఎం ఆదేశాల మేరకు 110 కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు పెట్టామన్న అధికారులు, మిగిలిన చోట్ల కూడా త్వరలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు బాగా చేస్తున్నాం ► క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లో 85–90 శాతం పరీక్షలు కొనసాగుతున్నాయి. ► 104, 14410 తదితర కాల్ సెంటర్ల పనితీరు సమర్థవంతంగా ఉండాలి. ► ప్రజలు ఏ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసినా వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి. ► అధికారులు అప్పుడప్పుడూ ఈ కాల్ సెంటర్లకు ఫోన్‌చేసి అవి సమర్థవంతంగా ఉన్నాయా? లేదా అన్నది పరిశీలించాలి. ► కాల్ సెంటర్ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేయాలి. కోవిడ్ చికిత్సపై విస్తృత ప్రచారం ► కోవిడ్ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్న దానిపై అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి. ► కోవిడ్ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండి. ► ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలి. ► ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి. ► గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు ఆరోగ్యమిత్రలుగా.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా ఉండాలి. దీంట్లో వలంటీర్ భాగస్వామ్యం కూడా ఉండాలి. ► స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు విద్యాకానుకతోపాటు మాస్కులు కూడా ఇవ్వాలి. ► ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5 వేలు ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరణాల రేటు తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ మరణాల రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. దీనికి సంబంధించిన వైద్యం క్షేత్రస్థాయికి చేరాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ.. ► తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై, మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ► జ్వరం వచ్చి, శ్వాసకోస సమస్యలతో బాధపడితే, ఆక్సిజన్ లెవల్ పడిపోతే.. వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తున్నాం. ► అలాంటి లక్షణాలు ఉన్న వారిపై వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్ఎంకు, వైద్యులకు సమాచారం ఇవ్వమని ప్రచారం చేస్తున్నాం. -
'లాక్డౌన్ పెడితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి'
సాక్షి, కరీంనగర్ : ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా లాక్డౌన్ పెడితే ఆర్థిక పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్య రథం,టెలీ మెడిసిన్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ఎవరూ నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు... ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినప్పుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు.. కానీ మరుసటి రోజే కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమే. ఇలా విమర్శలు చేయడం వల్ల మన కరోనా వారియర్స్ ను నిరుత్సాహ పరిచినట్లే. మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడం లేదు. కరోనా నుంచి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవరు మాట్లాడరు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు... ఫలితాలు దాస్తున్నారు అనడం సరికాదు.(తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు) ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని నా విజ్ఞప్తి. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది అసలు సందర్భం కాదు. ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం వల్ల ప్రజలు అయోమయంకు గురయ్యే అవకాశం ఉంది. దయచేసి కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులను నిరుత్సాహపరిచే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలి. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలి. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగంలో ముందంజలో ఉంది. కరోనా వ్యాక్సిన్ తొందరలోనే రావాలని కోరుకుంటున్నా.ప్రతిమ ఫౌండేషన్ సేవలను నా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం రావడం సంతోషం. 200 ఆరోగ్య ప్రతిమ కేంద్రాలు ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు వైద్యం అందించడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిమ ఫౌండేషన్ కోటి మాస్కులు పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయం' అని కేటీఆర్ అన్నారు. -
ప్రతీ డాక్టర్‌కు ‘టెలిమెడిసిన్’!
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఉపక్రమించింది. సాధారణంగా ఆరోగ్య సమస్యలొస్తే డాక్టర్‌ను నేరుగా సంప్రదించి సలహా తీ సుకోవాలి. కానీ డాక్టర్‌ను నేరుగా కలిసే అంశంలో ఎంసీఐ భారీ మార్పులు తీసుకువచ్చింది. డాక్టర్‌తో నేరుగా కాకుండా ఫోన్లో లేదా వీడియో లేదా చాట్ ఆధారంగా ఓపీ సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యంలో లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి డాక్టర్‌కు టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు ను తప్పనిసరి చేస్తూ ఎంసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను ఎంïసీఐ రూ పొందించగా.. కేంద్రం దీన్ని ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసింది. సులువుగా వైద్య సేవలు.. దేశంలో జనాభా నిష్పత్తికి తగినట్లు వైద్యులు అందుబాటులో లేరు. ఈక్రమంలో వైద్య సేవలను సామాన్యులకు అందించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కేంద్రం టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ ప్ర భావంతో గత 3 నెలలుగా మెజారిటీ క్లినిక్‌లు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డాక్టర్లు ఓపీ చూస్తున్నా.. పరిమితంగా సేవలు అందించడంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టెలీమెడిసిన్ విధానాన్ని ప్రతి ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)కి తప్పనిసరి చేసింది. వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న ప్రతి డాక్టర్ ఈ సర్టిఫికెట్ కోర్సు చేయాల్సిందే. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రోగితో ఫోన్లో, వీడియోకాల్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ పద్ధతిలో కూడా వైద్య సేవ లు అందించొచ్చు. అలాగే ఆరోగ్య స్థితిని క్రమం తప్ప కుండా ఫాలోఅప్ చేయొచ్చు. ఈ పద్ధ తితో తక్కువ సమ యంలో ఎక్కువ మంది పేషంట్లను చూసే వీలుంటుంది. ఈ టెలిమెడిసిన్ కోర్సుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుంది. దాని ఆధారం గా ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించి అర్హత ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో.. టెలిమెడిసిన్ సర్టిఫికెట్ కోర్సు పర్యవేక్షణకు సంబంధించి ఎంసీఐ ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆరుగురు సభ్యులు న్న ఈ కమిటీకి డాక్టర్ బీఎన్ గంగాధర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. డాక్టర్ నిఖిల్ థండన్ ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మాధురి కనిత్కర్, డాక్టర్ కేఎస్ శర్మ, డాక్టర్ రాజీవ్ గార్డ్ సభ్యులుగా, డాక్టర్ ఆర్కే వాట్స్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఈ టెలిమెడిసిన్ కోర్సు అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మరో 12 మంది నిపుణులను కూడా నియమించనుంది. ఈ దిశగా ఎంసీఐ ఆన్లైన్ కోర్సును అభివృద్ధి చేస్తోంది. టెలిమెడిసిన్ చికిత్స, నిర్వహణకు సంబంధించి ఎంసీఐ పలు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో మార్గాలు.. టెలిమెడిసిన్ విధానంలో రోగులకు సౌకర్యాన్ని బట్టి చికిత్స, సమాచారం ఇవ్వొచ్చని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఫోన్, వీడియో, ఆడియో కాల్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ హ్యాంగౌట్, స్కైప్, ఈ–మెయిల్ తదితర మాధ్యమాలతో టెలిమెడిసిన్ చికిత్స అందించొచ్చు. టెలిమెడిసిన్ విధానానికి సాధారణ వైద్య సేవలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. -
20 వేల మందికి టెలీమెడిసిన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ వ్యవస్థకు ఆదరణ పెరుగుతోంది. సుమారు నెల రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్న వారి సంఖ్య 20 వేల మార్కు దాటింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ఫోన్ చేస్తే చాలు వైద్యులు సూచనలు, సలహాలతో పాటు మందులు ఇచ్చే కార్యక్రమానికి ఏప్రిల్ 14న ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 14410 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు తిరిగి మనకే ఫోన్ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు మన ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మందులు సూచించడం, లేదంటే సలహాలు ఇస్తారు. ఈ 14410కు కాల్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య 20,256కు చేరింది. ఇందులో కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారుగా 348 మందిని గుర్తించారు. కోవిడ్ సమయంలోనే కాదు ఈ వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కూడా టెలీమెడిసిన్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో విస్తరింపజేసి, వైద్యుల సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. -
‘డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. టెలిమెడిసిన్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. (చదవండి : లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్) ‘డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్’ ఎలా పనిచేస్తుందంటే... ►టెలి మెడిసిన్ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు 14410 కేటాయింపు. ►ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ ముందుకు వచ్చారు. ►వీరంతా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు టెలి మెడిసిన్ ఉద్దేశం ►కోవిడ్–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం. ►ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు. ► డాక్టర్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెన్స్ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది. మూడంచెలుగా ‘డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్’: స్టెప్–1: ►14410 టోల్ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్ ఆ మొబైల్ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది. ►ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్∙రోగికి కాల్ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ►రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు. స్టెప్–2: ►రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ►ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్చేసి ఓపీ సేవలు అందిస్తారు. ►ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. ►వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు. ►ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. ►అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుంది. ►అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు. స్టెప్–3: ►కోవిడ్–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన. ►ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు. ►ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. వైద్యాధికారి–పీహెచ్సీ ►ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు. ►ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు. ►నాన్ కోవిడ్ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది. -
టెలీమెడిసిన్‌తో ఉత్తమ వైద్యం
సదస్సులో వైద్య నిపుణుల ఆశాభావం సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్య సేవల్లో టెలీమెడిసిన్ కీలకంగా మారబోతోందని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందజేసే అవకాశం ఉందన్నారు. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషి యన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఈఏ పీఐఓ) 7వ వార్షిక సదస్సు శనివారం పార్క్‌హ యత్‌లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశంతో పాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల నుంచి సుమారు 70 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈఏపీఐఓ అధ్యక్షుడు డాక్టర్ శంఖు సురేందర్‌రావు, ఎలక్టివ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేశ్ మెహతా, ఎలక్టివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనుపమ్ సిబల్, కోశాధికారి డాక్టర్ సుధీర్ బారీక్, ప్రధాన కార్యదర్శి నందకు మార్ జయరామ్, డాక్టర్ అమితవ్ బెనర్జీ, డాక్టర్ నీరజ్ భల్లా, డాక్టర్ సురేంద్ర కె.వర్మ, డాక్టర్ అరుణ్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, హైపర్‌టెన్షన్, కేన్సర్ వంటి జబ్బులు పెరుగుతున్నాయన్నారు. టెలీమెడిసిన్ ప్రవేశంతో ఈ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే టెలీమెడిసిన్ అందుబాటులోకి వస్తుం దన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది 2017 అవార్డును ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ నవాబ్ షఫీ ఉల్‌ముల్క్‌కు అందజేశారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఈ టెలీ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్ ద్వారకానాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుండెకు ‘బీఎల్ఎస్’ భరోసా
– బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణతో మరణాలు తగ్గే అవకాశం – గుండెపోటు వస్తే గంటలోపు ఆసుపత్రికి చేర్చాలి – భవిష్యత్ టెలీమెడిసిన్దే – ఏపీసీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి, కార్డియాజిలస్టు డాక్టర్ రమేష్ బాబు కర్నూలు(హాస్పిటల్): బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్)పై ప్రతి ఇంట్లో ఒక్కరికైనా అవగాహన ఉంటే 90 శాతం గుండెపోటు మరణాలు తగ్గించినట్లే అని విజయవాడ రమేష్ హాస్పిటల్స్ అధినేత, ఏపీ కార్డియాలజిస్ట్సు సొసైటీ ఇండియా(ఏపీసీఎస్ఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి. రమేష్‌బాబు పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ‘కార్డియో సీఎంఈ–2016’ అనే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న గుండెజబ్బులతో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా జీడీపీ రేటు కూడా క్షీణిస్తోందన్నారు. గుండెజబ్బులపై అవగాహన పెంచేతే 50 శాతం మరణాలు తగ్గి జీడీపీ రేటు ఒక శాతం పెరుగుతుందని తెలిపారు. దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు ఏటా వ్యాధుల బారిన పడి దారిద్య్రరేఖకు దిగువకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన వారిని గంటలోపు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించగలిగితే 90 శాతం మరణాలు తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. 29న బీఎల్ఎస్ ప్రారంభం.. ఏపీ కార్డియాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 155 మంది కార్డియాలజిస్టులు ఈ నెల 11వ తేదీన విజయవాడలో సమావేశమయ్యారని..ఈ ఏడాది బీఎల్ఎస్ ప్రోగ్రామ్‌ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టేందుకు తీర్మానించారని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బీఎల్ఎస్, లిటిల్ హార్ట్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గుండె జబ్బులను ముందే గుర్తించొచ్చు.. రోగి స్థితిగతులను తెలియజేస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులతో మెరుగైన చికిత్స అందించవచ్చని..ఇందుకు టెలీమెడిసిన్ దోహదం చేస్తుందన్నారు. ఇలా చేస్తే చాలా వరకు కేసులు ఐసీయూకు రానవసరం లేదన్నారు. వ్యక్తికి యాంజియోగ్రామ్ చేయకుండానే ‘ఇంటలిజెంట్ సీటీ స్కానింగ్’ యంత్రం ద్వారా వచ్చే 15 ఏళ్లలో మనిషికి వచ్చే గుండెజబ్బులను సైతం ముందే కనుగొనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో అడ్వాన్సెస్ ఇన్ కార్డియాక్ ఇమేజింగ్‌పై డాక్టర్ షేక్ మౌలాలి(విజయవాడ), రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిలూర్పై ఏపీసీఎస్ఐ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. శరత్చంద్ర(హైదరాబాద్), హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సర్జరీపై డాక్టర్ ఆర్వీ కుమార్(హైదరాబాద్ నిమ్స్), డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ కరొనరీ సిండ్రోమ్‌పై డాక్టర్ పి. రమేష్‌బాబు(విజయవాడ) ప్రసంగించారు. బియ్యం, చక్కెర మానేస్తేనే మేలు గుండెజబ్బులు, షుగర్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చక్కెర, తెల్లని పాలిష్పట్టిన బియ్యాన్ని తినడం మానేస్తేనే మేలని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ సూచించారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ కార్డియాలజీ విభాగం అందిస్తున్న సేవలను కొనియాడారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో 30 శాతం మరణాలు గుండెజబ్బుల వల్లే చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతో గుండెజబ్బులు పెరుగుతున్నాయని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం కంటే రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. -
టెలీమెడిసిన్‌తో సత్వర వైద్య సేవలు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ - దెందులూరు సీహెచ్‌సీలో ‘టెలీమెడిసిన్’ ప్రారంభం దెందులూరు : టెలీమెడిసిన్ ద్వారా రోగికి సత్వర వైద్యం అందేందుకు వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందిస్తారని, ఈ విధానం రోగులకు ఎంతో మేలు చేకూరుస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ విభాగాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. డాక్టర్ రమేష్ హాస్పటల్స్ చైర్మన్ మద్దిపాటి సీతారామ్మోహనరావు, ఎండీ డాక్టర్ రమేష్‌ల ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టెలీమెడిసన్ విధానం వల్ల రోగి పరిస్థితిని వైద్యులు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుసుకోవచ్చని, ఫోన్లో రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వీడియో ద్వారా వైద్యసేవలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైద్యులు కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని జవాబుదారీతనంతో వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రథమంగా దెందులూరులో టెలీమెడిసన్ విభాగం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. దెందులూరుకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని మంత్రిని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, డీఎంహెచ్‌వో శంకరరావు, ఎస్పీహెచ్వో డాక్టర్ దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం భేష్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం భేష్ అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఈ పథకంతో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. పథక లక్ష్యం మంచిదే అయినా అమలులో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని తెలిపారు. -
ఫోన్ కొడితే ఆయుర్వేద వైద్యసేవలు.. వీడియోకాన్ సరికొత్త ఫీచర్
సెల్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రైవేటు టెలికం సంస్థ వీడియోకాన్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ఆయుర్వేద వైద్య సేవలను తమ వినియోగదారులకు అందిస్తోంది. ఈ వైద్యసలహాలు, సేవలు పొందాలంటే వినియోగదారులు 535133 నెంబరుకు డయల్ చేయాలి. ఇందుకు నిమిషానికి ఆరు రూపాయల చార్జి అవుతుంది. అలాగే, వినియోగదారులు కావాలనుకుంటే ఇంటికే మందులు కూడా పంపుతారు. ఇందుకు ఇంటి వద్దే డబ్బులు తీసుకుంటారు. ఈ సేవలు దేశంలోని 1300 నగరాల్లో అందుబాటులో ఉంటాయి. జీవా ఆయుర్వేద గ్రూపు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేసినప్పుడు సర్టిఫైడ్ ఆయుర్వేద వైద్య నిపుణులు మాట్లాడి, చికిత్స ఏం తీసుకోవాలో చెబుతారు. కావాలనుకుంటే అప్పుడే వినియోగదారులు మందులను ఆర్డర్ చేయొచ్చు. ఆసియాలోనే అతి పెద్దదైన ఆయుర్వేద టెలి మెడిసిన్ సర్వీసు ద్వారా అందించే ఈ సర్వీసులో 150 మందికి పైగా వైద్యులు అందుబాటులో ఉంటారు. దీనిద్వారా ప్రజలకు వీలైనంత అందుబాటులో వైద్యసేవలు అందించేందుకు వీలుంటుందని వీడియోకాన్ టెలికం డైరెక్టర్, సీఈవో అరవింద్ బాలి తెలిపారు.