మాట్లాడుతున్న జస్టిస్ నందా
సనత్‌నగర్ (హైదరాబాద్): రోగులకు టెలీ మెడిసిన్ విధానం సులభతరమై నప్పటికీ ఆ విధానంలో నిర్దిష్ట మార్గదర్శకాలు తప్పనిసరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.నందా స్పష్టం చేశారు. టెలీమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా (టీఎస్‌ఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని లక్ష్మీబిల్డింగ్స్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన టీఎస్‌ఐ సేవల ప్రారంభ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నందా టెలీ మెడిసిన్ ద్వారా పలు రాష్ట్రాల్లో చికిత్స పొంది మృతి చెందిన వారి వివరాలను ఉదహరిస్తూ.. ఆ విధానంలో నిబంధనలు, పాలసీలను మరింతగా పటిష్టం చేయాలని కోరారు. వైద్య విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే టెలీ మెడిసిన్ కోర్సులు కూడా తీసుకురావలసిన అవసరం ఉందని సూచించారు. టీఎస్‌ఐ తెలంగాణ అధ్యక్షుడు డీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ 14 రాష్ట్రాల్లో టీఎస్‌ఐ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, టీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు పీకే ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment