ఫిలిప్పీన్స్... వైద్య విద్యకు మంచి వేదిక | Better Education, low fees in Philippines! | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్... వైద్య విద్యకు మంచి వేదిక

Published Wed, Aug 10 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఫిలిప్పీన్స్... వైద్య విద్యకు మంచి వేదిక

ఫిలిప్పీన్స్... వైద్య విద్యకు మంచి వేదిక

* తక్కువ ఫీజు, నాణ్యమైన విద్య
* వందలాదిగా వెళ్తున్న తెలుగు విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్: అందుబాటులో ఫీజులు. నాణ్యమైన విద్య. చక్కటి మౌలిక వసతులు. అచ్చం తెలుగు నేలను తలపించే వాతావరణం... వైద్య విద్య అభ్యసించాలనుకునే తెలుగువారికి ఫిలిప్పీన్స్ మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందిప్పుడు. డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోవడం మన దేశంలో చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో... ఎంబీబీఎస్‌ను కేవలం 18 లక్షల్లో పూర్తి చేయగల అవకాశంతో విద్యార్థులను ఊరిస్తోంది. చైనా తదితర దేశాలకు వెళ్తున్న మన విద్యార్థులకు భాషే అతి పెద్ద సమస్య. స్థానిక భాషను నేర్చుకోవడానికే కనీసం ఏడాది పడుతుంది. దాంతో కోర్సు కాలవ్యవధి కూడా ఆ మేరకు పెరిగిపోతోంది. ఫిలిప్పీన్స్‌లో మాత్రం 93 శాతానికి పైగా ప్రజలు ఇంగ్లిషే మాట్లాడతారు.
 
దవావో... బెస్ట్ ఇన్ ఫిలిప్పీన్స్
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దవావో నగరంలో ఉన్న దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ తెలుగు విద్యార్థులను ఆకర్షిస్తోంది. వరంగల్‌కు చెందిన ఆకుల అరుణ్ రాజ్ తాజా బ్యాచ్‌లో కాలేజీ గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచాడు! ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల జాబితాలోనూ దవావో కొన్నేళ్లుగా టాప్ 10లో ఉంటూ వస్తోంది. వాతావరణ పరిస్థితులతో పాటు వ్యాధులు కూడా ఇంచుమించుగా మనలాగే ఉంటాయి. పైగా ఫిలిప్పీన్స్‌లో మరే కాలేజీలోనూ లేనివిధంగా దవావో కాలేజీలో ఎంబీబీఎస్‌ను సరిగ్గా ఐదేళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.
 
చక్కని మౌలిక సదుపాయాలు
100 మంది పైచిలుకు బోధన సిబ్బంది, అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్, చక్కని లైబ్రరీ తదితరాలు దవావో కాలేజీ సొంతం. రూ.30 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిమ్యులేషన్ సెంటర్ ఆసియాలో సింగపూర్ తర్వాత ఈ కాలేజీలోనే ఉంది. కీలకమైన క్లినికల్ ఎక్స్‌పోజర్‌కూ దవావో పెద్దపీట వేస్తోంది. ఎంబీబీఎస్ క్లర్క్‌షిప్ (మన హౌజ్‌సర్జన్)లో భాగంగా ప్రతి విద్యార్థీ కనీసం 21 కాన్పులు చేయాల్సి ఉంటుంది. క్లర్క్‌షిప్‌లోనే 100 కాన్పుల దాకా చేసినవారూ ఉన్నారు!
 
యూఎస్‌ఎంఎల్‌ఈ మేడ్ ఈజీ!
ఎంబీబీఎస్ అనంతరం అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు పాసవాల్సిన యూఎస్ మెడికల్ లెసైన్సింగ్ ఎగ్జామినేషన్ (యూఎస్‌ఎంఎల్‌ఈ) విషయంలో కూడా దవావో విద్యార్థులకు చాలా పెద్ద సానుకూలత ఉంటుంది. భారత్‌లో అయితే ఎంబీబీఎస్ పూర్తయి, డాక్టర్‌గా ఎంసీఐ సర్టిఫికేషన్ వచ్చాక గానీ యూఎస్‌ఎంఎల్‌ఈ రాయడానికి వీల్లేదు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం ఎంబీబీఎస్ సెకండియర్ పూర్తవగానే యూఎస్‌ఎంఎల్‌ఈ స్టెప్-1, కోర్సు పూర్తయిన వెంటనే స్టెప్-2 రాసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌జీ కన్సల్టెన్సీ ద్వారా కొన్నేళ్లుగా తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్‌లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. మంచి నాణ్యతతో కూడిన అచ్చ తెలుగు భోజనం, చక్కని సదుపాయాలతో కూడిన హాస్టల్ వసతిని సంస్థే కల్పిస్తోంది.
 
ఇంకెక్కడా దొరకదు
తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 150 మందికి పైగా మా సంస్థ ద్వారా దవావో మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. ఎంతోమంది వైద్యులు, పోలీసు అధికారులు మా ద్వారా తమ పిల్లలను చేర్పించారు. కోర్సు ఫీజు రూ.17.75 లక్షలు. 9 సులభ వాయిదాల్లో కట్టవచ్చు. అన్ని ఖర్చులూ కలిపి 30 లక్షలకు అటూ ఇటుగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవచ్చు. వివరాలకు 8977200222 నంబర్లో మమ్మల్ని సంప్రదించవచ్చు.
- సతీశ్‌బాబు గరికపాటి, మేనేజింగ్ డెరైక్టర్, ఎస్‌జీ కన్సల్టెన్సీ
 
మేం చాలా హ్యాపీ
ఇక్కడి ఫ్యాకల్టీ చాలా అనుభవజ్ఞులు. మన దగ్గర రిఫరెన్స్‌గా వాడే పుస్తకాలు మాకు కోర్సులో భాగం. భద్రతపరంగా ఇక్కడ పూర్తి నిశ్చింతగా ఉండవచ్చు. దవావో కాలేజీని ఎంచుకున్నందుకు మాతో పాటు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ.
-  సాకేత్ వైద్య, నిజామాబాద్; బుసిరెడ్డి, (కడప); రామ్ (గుంటూరు) ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement