
నోట్ల రద్దుపై భారత్ బంద్ శోచనీయం
అమరావతి : చలామణిలో ఉన్న పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు సోమవారం దేశవ్యాప్త బంద్‌ను తలపెట్టడం శోచనీయం, దౌర్భాగ్యమని భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్ శాఖ పేర్కొంది. ఆ పార్టీ నేతలు ఎస్. సురేష్‌రెడ్డి , యడ్లపాటి రఘునాధ్‌బాబులు ఆదివారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.
దేశ హితం కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకునే నోట్ల రద్దు వంటి కీలకమైన నిర్ణయాలను కూడా ప్రతిపక్ష పార్టీలు గుడ్డిగా వ్యతిరేకించడం సరైందని కాదని రఘునాథ్‌బాబు అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే బంద్‌లు ఏవిధంగాను సహేతకం కాదని చెప్పారు. తాడేపల్లిగూడెం బీజేపీ రైతు మహాసభ తమ పార్టీ అంచనాలకు మించి విజయవంతం అయిందని సురేష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సభను జయప్రదం చేసిన రైతు సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.