ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు | block day in ap history : k.ramakrishna | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు

Published Thu, Sep 8 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

block day in ap history : k.ramakrishna

నేడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన
సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపు

 సాక్షి,హైదరాబాద్: కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను వంచించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ.. అసలు ప్యాకేజీయే కాదని కొట్టిపారేశారు. బడ్జెట్ లోటుని ఎవరు పూర్తి చేస్తారో వివరణే లేదన్నారు. కొండ ప్రాంతాలకే ప్రత్యేక హోదా ఇస్తారని అరుణ్ జైట్లీకి ఇప్పడు తెలిసిందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పార్టీ శ్రేణులకు రామకృష్ణ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement