హైదరాబాద్లో ఆదివారం బోనాలు వైభవంగా జరిగాయి.
హైదరాబాద్: హైదరాబాద్లో ఆదివారం బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నగరంలోని ఆలయాలను ప్రత్యేక అలంకరణలతో బోనాల కోసం సిద్ధం చేశారు. పాతబస్తి జనసంద్రమైంది. సింహవాహిని, బిజిలీ మహంకాళి అని పిలుచుకునే లాల్‌దర్వాజ బోనాల జాతరలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. తెలంగాణ మంత్రులతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.