lal darwaza
-
హోరెత్తిన బోనాలు.. ఈరోజు రంగం
-
Bonalu: పాతబస్తీకి పండగొచ్చింది
చార్మినార్/చాంద్రాయణగుట్ట: పాతబస్తీకి ఉత్సవ కళ వచ్చింది. బోనాల పండగతో ఉత్సాహం ఉట్టిపడుతోంది. ఆషాఢమాసం బోనాల జాతరలో భాగంగా ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారి దేవాలయం సహా అన్ని ప్రధాన ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమరి్పంచి పూజలు చేస్తారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. భక్తులకు వసతులు కల్పించాలి: ఆమ్రపాలి లక్డీకాపూల్: బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఆదివారం జరగనున్న బోనాల ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం వైన్స్ యథావిధిగా తిరిగి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. -
ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు
-
నేడు లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలు
-
ఘనంగా లాల్‌దర్వాజ బోనాలు
-
నేడు లాల్ దర్వాజ బోనాలు
-
లాల్‌దర్వాజా బోనాలకు బందోబస్తు
చాంద్రాయణగుట్ట : లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే అన్ని ఆలయాల కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించారు. సున్నితమైన అలియాబాద్, శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రౌడీషీటర్లను బైండోవర్ కూడా చేశారు. వచ్చే ఆదివారం జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. నిఘా కోసం లాల్‌దర్వాజా ప్రధాన రహదారిలో 20 సీసీ కెమెరాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను శాలిబండ పోలీస్‌స్టేషన్ నుంచి పర్యవేక్షిస్తారు. బందోబస్తులో ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు ఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 300 మంది కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఉంటారు. బోనాల సందర్భంగా మహిళలపై వేధింపులు, చైన్ స్నాచింగ్‌ల బెడద లేకుండా షీ టీమ్‌లతో పాటు యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్‌లను రంగంలోకి దిగుతాయి. డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది ఆలయాలు.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం, గౌలిపురా మాతేశ్వరీ మహంకాళి, మక్దూంపురా ఎల్లమ్మ, గాంధీనికేతన్ బంగారు మైసమ్మ, సీఐబీ క్వార్టర్స్ నల్ల పోచమ్మ, అలియాబాద్ దర్బార్ మైసమ్మ, మేకలబండ నల్ల పోచమ్మ, వివేకానంద నగర్ బంగారు మైసమ్మ ఆలయాల తరఫున బోనాల్లో పాల్గొంటారు. -
హైదరాబాద్ లో వైభవంగా బోనాలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నగరంలోని ఆలయాలను ప్రత్యేక అలంకరణలతో బోనాల కోసం సిద్ధం చేశారు. పాతబస్తి జనసంద్రమైంది. సింహవాహిని, బిజిలీ మహంకాళి అని పిలుచుకునే లాల్‌దర్వాజ బోనాల జాతరలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. తెలంగాణ మంత్రులతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.