సికింద్రాబాద్: తుకారాంగేట్ లో జరిగిన బాలుని కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. యజమాని ఇంట్లో అద్దెకున్న సంగీత అనే మహిళే ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఓ పథకం ప్రకారమే బాలున్ని అపహరించినట్లు సంగీత తెలిపింది. అనంతరం ఆ బాలున్ని రూ.1.60 లక్షలకు ఓ వ్యక్తికి అమ్మినట్లు సంగీత అంగీకరించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలున్ని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.