హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి. దీంతో ప్రజా రవాణ పూర్తిగా స్తంభించింది. బస్సులు, ఆటోలు సహా అన్నిరకాల ప్రజారవాణ వాహనాలు నిలిచిపోయాయి. బీఎంఎస్ మినహా దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. లారీ ఓనర్ల అసోసియేషన్, ఆటో కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతివ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది.
కార్మిక వ్యతిరేక విధానాలు, రహదారి రవాణ భద్రత బిల్లు ఉపసంహరించుకోవాలని, కార్మికుల కనీస వేతనాలు 15వేల రూపాయలు డిమాండ్ చేస్తూ..కార్మిక సంఘాలు ఈ బంద్ చేపట్టాయి. బంద్‌లో భాగంగా హైదరాబాద్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హయత్‌నగర్ డిపో కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... డిపో ఎదుట నిరసనకు దిగారు. మెదక్‌లోనూ కార్మికుల రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలను సైతం అడ్డుకున్నారు.
ఎక్కడ వాహనాలు అక్కడే...
Published Wed, Sep 2 2015 7:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement