మెట్రో పిల్లర్‌కు ఢీ కొట్టి.. | Car hits metropillar in chaitanyapuri, two died | Sakshi
Sakshi News home page

ఘోరం: మెట్రో పిల్లర్‌కు ఢీ కొట్టి..

Published Thu, Jul 20 2017 10:41 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

మెట్రో పిల్లర్‌కు ఢీ కొట్టి.. - Sakshi

మెట్రో పిల్లర్‌కు ఢీ కొట్టి..

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చైతన్య(24) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన ఐదుగురు యువకుల్లో ఒక వ్యక్తి ఆసుపత్రిలో కన్నుమూశాడు.

పిల్లర్‌ను ఢీ కొట్టబోయే ముందు అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి మీదుగా కారు వెళ్లడంతో అతని కాళ్లు విరిగిపోయాయి. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిలో ఓ వ్యక్తిని విచారించినట్లు తెలిసింది. బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని అతను వాపోయినట్లు ఓ అధికారి తెలిపారు.

ఫంక్షన్‌లో మద్యం సేవించామని బాధితుడు చెప్పినట్లు వెల్లడించారు. గాయాలపాలైన వారందరిని సమీపంలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement