బంజారాహిల్స్లో కారు బీభత్సం: యువతులకు గాయాలు | car hulchul in banjara hills road number 12 | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో కారు బీభత్సం: యువతులకు గాయాలు

Published Sun, Feb 21 2016 8:26 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

బంజారాహిల్స్లో కారు బీభత్సం: యువతులకు గాయాలు - Sakshi

బంజారాహిల్స్లో కారు బీభత్సం: యువతులకు గాయాలు

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12 లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు కారును రహదారిపై నుంచి పక్కకు తీశారు.  ఈ ప్రమాదానికి గల కారణం అతివేగమే అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement