శంషాబాద్: వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి... కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని పక్కకు తీసి... బయటకు దిగిపోగారు. దీంతో వారికి గాయాలు కాగా... కారు క్షణాల్లో కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని తెలుస్తుంది.
ఔటర్‌పై కారు దగ్ధం
Published Wed, Mar 23 2016 6:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement