పాతబస్తీలో పోలీసుల తనిఖీలు.. | Cardon & Search operation by City Police in Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పోలీసుల తనిఖీలు..

Published Sat, Sep 16 2017 8:57 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

Cardon & Search operation by City Police in Hyderabad

హైదరాబాద్: సిటీ పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పాతబస్తీ బహదూర్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని దాల్ మండీ, అల్లామసీద్ ప్రాంతాల్లో  ఈ తనిఖీలు చేశారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో 350 మంది పోలీసులు ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు.

తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 22 మంది అనుమానితులు, 8 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసులో తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement