దసరా రోజున నిర్వహణకు టీఆర్‌ఎస్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటును వేడుకగా జరపాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో పార్టీ నుంచి జరిగిన సంబరాలను మించి నిర్వహించాలన్న చర్చ కూడా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కనీస ఆలోచన చేయలేద ని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సాహసోసేత నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి.
కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చిన రోజున వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నా యి .ఇప్పటికే అధినాయకత్వం నుంచి ఇందుకు సంబంధించిన ఆదేశాలు అందాయి. సీఎం అధికారిక నివాసంలో ఆది, సోమవారాల్లో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులతో జరిగిన సమావేశాల్లోనే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతోపాటు సంబరాల నిర్వహణకు సంబంధించిన అంశమూ చర్చ కు వచ్చింది.
దసరా రోజున సీఎం కేసీఆర్ స్వయంగా కనీసం మూడు నాలుగు జిల్లాల ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పా టు టీఆర్‌ఎస్ ఘనతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ రూపకల్పన చేసింది. హోంమంత్రి నాయిని స్వగ్రామం నేరెడిగొమ్మ కొత్త మండలంగా ఏర్పాటు కానుంది. ఈ మండల ఆవిర్భావానికి హోం మంత్రినే ముఖ్య అతిథిగా నిర్ణయించారని, నల్లగొండ జిల్లా నేతలతో సీఎం సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని సమాచారం.
అంబరాన్నంటేలా కొత్త జిల్లాల్లో సంబరాలు
Published Wed, Oct 5 2016 2:34 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement
Advertisement