నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీస్ శాఖపై గవర్నర్ పెత్తనం విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తమకు సమాచారం ఉందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని అధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. రైతులపై లాఠీచార్జ్ దురదృష్టకరం అని మంత్రి నాయిని అన్నారు.