2018 నుంచి ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్‌! | central govt plans for one exam for engineering | Sakshi
Sakshi News home page

2018 నుంచి ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్‌!

Published Sat, Dec 24 2016 12:33 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

2018 నుంచి ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్‌! - Sakshi

2018 నుంచి ఇంజనీరింగ్‌కు ఒకే ఎంట్రన్స్‌!

కేంద్ర మానవ వనరుల శాఖ సూత్రప్రాయ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:
దేశవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఏకీకృత ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్డీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెండేళ్ల కిందట 2014 నుంచే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) ద్వారా ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించి నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షల నిర్వహణ వల్ల అక్రమాలకు ఆస్కారముండటం, లోపాలు తలెత్తడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న హెచ్‌ఆర్డీ 2018 నుంచి జేఈఈ ద్వారానే ఇంజనీరింగ్‌ సీట్లను భర్తీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఏడాది కిందట ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఏకీకృత పరీక్షకు మొగ్గు చూపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుత విధానంలో అనేక లోపాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, ఇంజనీరింగ్‌ కళాశాలలు యాజమాన్య సీట్ల పేరుతో అడ్డగోలుగా సీట్లు విక్రయిస్తున్నాయని నివేదించింది. దానికిగాను గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఇంజనీరింగ్‌ విద్యలో పడిపోతున్న ప్రమాణాలు, బోధన సిబ్బంది కొరత వంటి అంశాలను కూడా కమిటీ ఆ నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ ద్వారా మాత్రమే దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు జరపాలని సిఫారసులు చేసింది. వచ్చే ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించినా, సమయాభావంతో సాధ్యం కాదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచించడంతో 2018కి వాయిదా వేసింది. ఏకీకృత ప్రవేశ పరీక్ష అమల్లోకి వస్తే ఎంసెట్‌ నిర్వహణ ఉండదు. ఇప్పటికే మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement