17న విమోచనదినం జరపాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశత్వానికి సవాల్ విసిరి, యావత్తు సమాజానికి మార్గదర్శకునిగా నిలిచిన రావి నారాయణరెడ్డి జీవితం ఈతరం యువతకు ఆదర్శమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. పేదవానికి చదువు అందినప్పుడే సమ సమాజ నిర్మాణం అవుతుందని ఆయన భావించేవారని తెలిపారు.
బంజరా హిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో రావి నారాయణరెడ్డి 26వ వర్ధంతి సభను గురువారం సీపీఐ నిర్వహించింది. ఈ సభలో చాడ మాట్లా డుతూ సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా జరపక పోతే కేసీఆర్ సంగతి తేలుస్తామన్నారు. దేశంలో పాత్రికేయులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, గౌరి లంకేశ్ హత్యపై ప్రజాస్వామ్య శక్తులు స్పందించాలని అన్నారు. ఈ సభలో సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు.