దళితులను అవమానపర్చే విధంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఆయా సంఘాలు డిమాండ్ చేశాయి. పలుచోట్ల బాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. - సాక్షి, నెట్‌వర్క్
దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎమ్మార్పీఎస్
రాయదుర్గం: దళితజాతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకు లు డిమాం డ్ చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యం లో గచ్చిబౌలి ప్రధాన కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు డౌన్ డౌన్, దళితద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్యామ్‌లెట్ గణేష్‌మాదిగ మాట్లాడుతూ మాదిగల ఓట్లతో అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు దళితులను అవమానపర్చడం దారుణమన్నారు. రెండు రాష్ట్రాల దళితులను అవమానపర్చిన చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్‌ఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాదగిరి మాదిగ, రంగారెడ్డిజిల్లా అధికార ప్రతినిధి ఐతా రమేష్ మాదిగ,నాయకులు రజనీ, లక్ష్మీ, త్రినాథ్, ప్రేమ్‌కుమార్, రాజు, గోపాల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
వెంటనే అరెస్టు చేయాలి
హైదరాబాద్: ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుం టారంటూ అగ్రకుల దురహంకారాన్ని ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వెంట నే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాల ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షులు గడ్డం బాల స్వామి డిమాండ్ చేశారు. ఇంత చవకబారుగా మాట్లాడిన ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హతలేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. బాబు సీఎంగా కొనసాగడం దళిత జాతికే అవమానమన్నారు. గతంలో మాల, మాదిగల మధ్య చిచ్పుపెట్టారని, ఇప్పుడు ఏకంగా ఎస్సీల ను తీవ్రంగా అవమానించారన్నారు.
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
ముషీరాబాద్: దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడును దళితులు తరిమికొట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీ య అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎస్సీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వీఎస్.రాజు ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అగ్రకుల దురహంకారంతో దళితులను కించేపరిచే వ్యాఖ్య లు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఎస్.రాజు మాదిగ, నగర అధికార ప్రతినిధులు ఎడల రాజ్ మాదిగ, నాయకులు సోమయ్య మాదిగ, ప్రభాకర్ మాదిగ, దుర్గాప్రసాద్ మాదిగ, అడ్డాకుల లక్ష్మణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మరుక్షణమే చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అహంకారం తారస్థాయికి చేరిందని, ఎస్సీలం టే లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి
చిక్కడపల్లి: ఎస్సీలను కించపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఉన్నత న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కేసీఆర్ దళిత సేన వ్యవస్థాపక చైర్మన్ కోళ్ళ సుధాకర్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్‌డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించిన చంద్రబాబుపై కోర్టుకు వెళతామని అన్నారు. కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి పైశాచికానందం పొందడం బాబుకు కొత్తేమీ కాదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో కేసీఆర్ దళిత సేన నాయకులు పాలరాజు, పాండయ్య, నర్సింగ్‌రావు, గజ్జెల రాజశేఖర్, శివకుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో...
దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తక్షణం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల డుగు అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బంజారాహిల్స్‌లో తెలంగాణ మాల మహానాడు స్టేట్ కో-ఆర్డినేటర్ కె. సాయిగిరి, మాలల జేఏసీ చైర్మన్ బి. దీపక్‌కుమార్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దం డు లక్ష్మణ్, మాల నేతలు జి ప్రభాకర్, పి. శ్రీని వాస్, మధుసూదన్, సాయిరాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు కుల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
హెచ్చార్సీలో ఫిర్యాదు
నాంపల్లి: ఎస్సీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశా రు. అధికారంలో ఉన్న నేత ఇంత అహం కారపూరితంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నిం చారు. వెంటనే బాబును అరెస్టు చేయాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. ఆయన వెంట మాల మహా నాడు ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాస్, విద్యార్థి విభాగం నాయకుడు జి.సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ తదితరులు ఉన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసన వెల్లువ
Published Thu, Feb 11 2016 12:15 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement