చిన్నారుల దారుణహత్య | Children kidnapped, killed brutally | Sakshi
Sakshi News home page

చిన్నారుల దారుణహత్య

Published Thu, May 19 2016 11:40 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Children kidnapped, killed brutally

హయత్‌నగర్: అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులను బండరాళ్లతో మోది చంపిన ఘటన హయత్ నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో గురువారం వెలుగుచూసింది. మెట్ కు చెందిన ధర్మరాజు, ముకేష్ లు మూడు రోజుల క్రితం ఆచూకీ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, గురువారం అబ్దుల్లాపూర్ మెట్ శివారు ప్రాంతంలోని ముళ్లపొదల్లో ఇద్దరి మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసుల సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement