కమీషన్లు వచ్చే పనులకే బిల్లులు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రైతులను, పేదలను పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే పనులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోం దని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బిల్లుల చెల్లింపుల్లోనూ వివక్ష చూపిస్తోందన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయడంలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దాపరికంగా ఎందుకన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్‌ను పాటించలేదన్నారు. బాధ్యులపై సీఎస్‌కు ఫిర్యాదు చేస్తామని పొంగులేటి చెప్పారు.