Revenue divisions
-
రెవెన్యూ డివిజన్లు, మండలాల గందరగోళాన్ని సరిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఇ బ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి వాటిని సరిచేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటాం’అని రె వెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల స మయంలో పెద్దసంఖ్యలో సభ్యులు, రెవెన్యూ డి విజన్లు, మండలాల గందరగోళంపై అడిగిన ప్ర శ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.ఐదు మండలాలున్న చేర్యాల ప్రాంతంలో ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసు సంబంధిత పనులకు హుస్నాబాద్‌కు, వ్యవసాయశాఖ పనులకు గజ్వేల్ కార్యాలయానికి, కలెక్టరేట్ కోసం సిద్దిపేటకు తిరగాల్సి వస్తోందని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరముందన్నారు. ముధోల్, తాండూరు, జడ్చర్ల, వేములవాడ, నారాయణఖేడ్, వర్ధన్నపేట, మహబూబాబాద్.. ఇలా పలు నియోజకవర్గాల పరిధిలో నెలకొన్న ఇలాంటి సమస్యలపై సభ్యులు లేవనెత్తారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సమస్యలపై సీఎం, సహచర మంత్రులతో చర్చించి వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
కొత్త జిల్లాలకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు.. ముఖ్య సూత్రాలు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్ టు సెర్వ్ ప్రకారం ఆ జిల్లాల్లో వారి సేవలను వినియోగించుకోనుంది. మార్చి 11వ తేదీలోపు తాత్కాలిక కేటాయింపులు పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల అపాయింటెడ్ తేదీ నుంచి అధికారులు, ఉద్యోగులు కేటాయించిన చోటు నుంచి పని చేసేలా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిని ఆ జిల్లాల్లో తాత్కాలికంగా కేటాయించి, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పూర్తి స్థాయి విభజన చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల హెచ్ఓడీలు, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం సీఎస్ సమీర్ శర్మ జారీ చేశారు. కేటాయింపులకు ముఖ్య సూత్రాలు ► తాత్కాలిక కేటాయింపులో జిల్లా, డివిజినల్ కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర, రీజినల్/జోనల్, మండలం, గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకోకూడదు. ► జిల్లా, డివిజినల్ స్థాయిలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను కేటాయింపులో వదిలేయాలి. ఆ కార్యాలయాలు ప్రస్తుతం కొనసాగే జిల్లాల పరిధిలోనే ఉండేలా చూడాలి. ► తుది కేటాయింపు పూర్తయ్యే వరకు తాత్కాలిక కేటాయింపు ప్రకారం పనిచేసే వారి సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. ► జిల్లా/డివిజన్ హెడ్ తప్ప కొత్తగా ఏ పోస్టు సృష్టించకుండా కేటాయింపులు జరపాలి. ► ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు చేపట్టిన విభాగాధిపతులు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించాలి. జిల్లా కార్యాలయాల విభజన ఇలా.. ► జిల్లా పరిధి ఉన్న అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయ శాఖ జేడీ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. జిల్లా స్థాయి ఉన్నా జిల్లా పరిధి లేని కార్యాలయాలను కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోకూడదు. డివిజనల్ ఫారెస్ట్ అధికారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. డివిజనల్ స్థాయి పోలీసు కార్యాలయాలు తమ పరిధిని మార్చకుండా ప్రస్తుతం ఉన్న చోటు నుంచే పని చేయాలి. ► అన్ని శాఖలు జిల్లా స్థాయి పరిపాలనా యూని ట్ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే తరహా క్యాడర్ ఉన్న అధికారి పోస్టును సంబంధిత శాఖకు హెచ్ఓడీ కోసం ఉపయోగించుకోవాలి. కొత్త జిల్లాల్లో హెచ్ఓడీ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కోసం సమాన స్థాయి అధికారులతోపాటు దానికి ఒక ర్యాంకు పైన, ఒక ర్యాంకు తక్కువ క్యాడర్ అధికారుల పూల్‌ను ఏర్పాటు చేసుకోవా లి. అందుబాటులోని రాష్ట్ర, జిల్లా, జోనల్ కార్యాలయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ► జనాభా,సర్వీస్ డెలివరీ యూనిట్ల సంఖ్య(ఉ దా: అంగన్వాడీ కేంద్రాలు), దాని పరిధి, లబ్ధి దా రుల సంఖ్య ఆధారంగా కొత్త జిల్లాలకు అధి కా రులను ఆ రేషియో ప్రకారం (ప్రొవిజినల్ అ లొ కేషన్ రేషియో) తాత్కాలికంగా కేటాయించాలి. ► జిల్లా కార్యాలయాల మాదిరిగానే డివిజన్ కార్యాలయాలను అదే డివిజన్ స్థాయిలో తాత్కా లిక కేటాయింపులు చేసుకోవాలి. డివిజన్ పరిధి ఉన్న అన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపులో చేర్చాలి. ఆర్డీఓ కార్యాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి. డివిజన్ స్థాయి ఉండి, డివిజన్ పరిధిలోని కార్యాల యాలను కేటాయింపులో చేర్చకూడదు. ఫారెస్ట్ రేంజి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. నివేదికలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ► పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల హెచ్ఓడీలు 13 జిల్లాల్లో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను గుర్తించాలి. ప్రతి జిల్లాలో ఆయా శాఖల హెచ్ఓడీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో వేటిని విభజించాలి.. వేటిని విభజించకూడదు.. ఏవి జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలో నిర్ధారించాలి. ► ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనపై సూచించిన విధంగా నివేదికలు తయారు చేసి జిల్లా పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ► ఆ శాఖల కార్యదర్శులు.. కార్యాలయాలు, ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక కేటాయింపులను స్క్రుటినీ చేసి ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాలి. అనుమతిచ్చిన తర్వాత తుది కేటా యింపు జాబితా తయారవుతుంది. ఆర్థిక శాఖ చివరగా ఉద్యోగుల సేవలను ఎక్కడ వినియోగించుకుంటారో తెలుపుతూ ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలను ఆయా శాఖలకు జారీ చేస్తుంది. ► ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు మార్చి 11వ తేదీకల్లా ఇచ్చేలా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని సీఎస్ అన్ని శాఖల హెచ్ఓడీలు, ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్ వెలువడే లోపు పూర్తి కావాలి. ఆర్డర్ టు సెర్వ్.. తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగుల సేవలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో వినియోగించుకునేలా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు ఇవ్వాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీరి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లు పాత జిల్లాల్లో ఉన్నట్టుగానే కొనసాగుతాయి. తాత్కాలిక కేటాయింపులో భాగంగా జరిగిన సీనియారిటీ, పదోన్నతులు, సర్వీస్ అంశాలు, ఇతర సర్దుబాట్లన్నీ ప్రజా ప్రయోజనాల కోసం పరిపాలనా అవసరాల కోసం తాత్కాలికంగానే ఉంటాయి. తాత్కాలిక కేటాయింపు లేని ఉద్యోగులు పాత జిల్లాల కార్యాలయాల్లోనే అపాయింటెడ్ డే నుంచి పని చేయాలి. ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కోసం బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తారు. బదిలీల రవాణా అలవెన్సు వారి అర్హతలను బట్టి నిబంధనల ప్రకారం మంజూరు చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా పని చేసేందుకు కేటాయిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏపీసీఓఎస్ డేటా బేస్ ప్రకారం కేటాయించాలి. -
కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు.. 62 కు చేరనున్న మొత్తం.. పూర్తి వివరాలు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలో కనీసం రెండు డివిజన్లు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 15 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతమున్న 51 డివిజన్లలో నాలుగు డివిజన్లు ప్రస్తుతం ఉన్న డివిజన్లలో కలిసిపోనున్నాయి. ఈ నాలుగు పోగా మిగిలిన 47తోపాటు కొత్తవి 15 కలిపి మొత్తం 62 డివిజన్లు కానున్నాయి. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. బాపట్ల జిల్లాలో ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా లేకపోవడంతో బాపట్ల, చీరాల డివిజన్ల ఏర్పాటును కొత్తగా ప్రతిపాదించారు. అలాగే ప్రకాశం జిల్లాలో కనిగిరి, నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, డోన్, అనంతపురం జిల్లాలో గుంతకల్, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్లు సమీప డివిజన్లలో విలీనం కానున్నాయి. ఎటపాక.. రంపచోడవరం డివిజన్లో, కుకునూరు.. జంగారెడ్డిగూడెం డివిజన్లో, కనిగిరి.. కందుకూరు డివిజన్లో, ధర్మవరం.. కల్యాణదుర్గం, అనంతపురం డివిజన్లలో కలవనున్నాయి. -
ఏపీలో కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు.. 63కు చేరిన మొత్తం.. పూర్తి వివరాలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రెవెన్యూ డివిజన్ల స్వరూపం కూడా మారనుంది. కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 51 రెవెన్యూ డివిజన్లలోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తంగా రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కి చేరుకోనుంది. – సాక్షి, అమరావతి కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా.. 1. రాయచోటి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, సాంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు, మదనపల్లి డివిజన్లోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లె మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. 2. బాపట్ల తెనాలి డివిజన్లోని వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. 3. చీరాల ఒంగోలు డివిజన్లోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టేరు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవనుంది. 4. పలమనేరు మదనపల్లి డివిజన్లోని పలమనేరు, గంగవరం, బాలిరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజని, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచర్ల, సోమల, చౌడిపల్లి, పుంగనూరు, సొదం మండలాలు, తిరుపతి డివిజన్లోని పులిచెర్ల మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటుకానుంది. 5. డోన్ కర్నూలు డివిజన్లోని డోన్, బేతంచర్ల, పీపల్లె, నంద్యాల డివిజన్లోని బనగానపల్లి, అవుకు, కొల్లకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. 6. ఆత్మకూరు నంద్యాల డివిజన్లోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజన్లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడుతూరు మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి. 7. నందిగామ విజయవాడ డివిజన్లోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. 8. తిరువూరు విజయవాడ డివిజన్లోని మైలవరం, జి.కొండూరు, నూజివీడు డివిజన్లోని రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. 9. పుట్టపర్తి కదిరి డివిజన్లోని కదిరి, తలుపుల, నంబులిపులికుంట, గండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, పుట్టపర్తి, నల్లమడ, బుక్కపట్నం, కొత్త చెరువు, ఓడి చెరువు, అమడగుర్ మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. 10. బొబ్బిలి విజయనగరం డివిజన్లోని గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదం, పాలకొండ డివిజన్లోని రాజాం, వంగర, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, పార్వతీపురం డివిజన్లోని బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి. 11. భీమునిపట్నం విశాఖ డివిజన్లోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, మహరాణిపేట మండలాలను ఈ డివిజన్లో ప్రతిపాదించారు. 12 . భీమవరం కొవ్వూరు డివిజన్లోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నరసాపురం డివిజన్లోని భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, ఏలూరు డివిజన్లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఈ డివిజన్లో కలవనున్నాయి. పాత రెవెన్యూ డివిజన్లు మారేది ఇలా.. 1. అనకాపల్లి మొత్తం 15 మండలాలతో అనకాపల్లి డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో అనకాపల్లిలో డివిజన్లో ఉన్న 12 మండలాలు మాడుగుల, చీడిక, దేవరపల్లె, కె.కోటపాడు, అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, రా>ంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరంతోపాటు గతంలో విశాఖ డివిజన్లో ఉన్న పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాలు చేరనున్నాయి. 2. నర్సీపట్నం 10 మండలాలతో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. నర్సీపట్నం, గోలుగొండ, మాకవరపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రావికమతం, రోలుగుంట, కోటారుట్ల మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. 3. కల్యాణదుర్గం మొత్తం 12 మండలాలు. ఇందులో కొత్తగా ధర్మవరం డివిజన్‌కు చెందిన రామగిరి మండలాన్ని కల్యాణదుర్గం డివిజన్లో చేర్చారు. రాయదుర్గం, డి.హిరేహళ్, కనేకల్, బొమ్మనహళ్, గుమ్మగట్ట, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూర్, కుందర్పల్, కంబదూర్, బెలుగప్ప, రామగిరి మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. 4. అనంతపురం మొత్తం 14 మండలాలు. ఇందులో కొత్తగా ధర్మవరం డివిజన్ నుంచి మూడు మండలాలు చేరనున్నాయి. అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యెల్లనూరు, నారపాల, బి.కె.సముద్రంతో పాటు ధర్మవరం డివిజన్ నుంచి కంగనపల్లి, చెన్నే కొత్తపల్లి, రాప్తాడు మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి. 5. గుంతకల్లు మొత్తం 8 మండలాలు. గతంలో ఈ మండలాలు అనంతపురం డివిజన్లో ఉండేవి. తాజాగా ఉరవకొండ, విదపకల్లు, వజ్రకరూర్, గుంతకల్లు, గుత్తి, పమిడి, యాడికి, పెద్దవడుగు మండలాలతో డివిజన్ ఏర్పాటు కానుంది. 6. మదనపల్లి ఈ డివిజన్ 11 మండలాలకు పరిమితం కానుంది. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళపల్లి, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు మండలాలు ఈ డివిజన్లో ఉంటాయి. 7. రాజంపేట మొత్తం 11 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవుతోంది. ఇందులో కడప డివిజన్ నుంచి రెండు మండలాలు వచ్చి చేరనున్నాయి. కోడూరు, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రాజంపేట, సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరుతో పాటు కడప డివిజన్ నుంచి వీరబల్లె, టి.సుండుపల్లె మండలాలు చేరతాయి. 8. గూడూరు మొత్తం 11 మండలాలు. ఇందులో ఆత్మకూరు, నెల్లూరు డివిజన్ల నుంచి ఒక్కొక్కటి చొప్పున చేరనున్నాయి. గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడ, చిట్టమూరు, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లె, ఆత్మకూరు డివిజన్ నుంచి కలువాయి, నెల్లూరు డివిజన్ నుంచి రాపూరు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. 9. తిరుపతి చిత్తూరు నుంచి రెండు, మదనపల్లి నుంచి రెండు మండలాలతో కలిపి మొత్తం 11 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, పిచ్చాటూరు, నాగలాపురం, పాకాల, చంద్రగిరి, చిత్తూరు డివిజన్ నుంచి నారాయణవనం, రామచంద్రాపురం, మదనపల్లి డివిజన్ నుంచి ఎర్రవారిపాలెం, చినగొట్టిగల్లు మండలాలు ఇందులో ఉంటాయి. 10. నాయుడుపేట మొత్తం 13 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవుతోంది. సూళ్లూరుపేట, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడతో పాటు తిరుపతి డివిజన్ నుంచి శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీపురం, సత్యవేడు, బీఎన్ ఖండ్రిగ, వరదయ్యపాలెం మండలాలు ఇందులో ఉంటాయి. 11. చిత్తూరు ఈ డివిజన్లో 18 మండలాలు ఉంటాయి. చిత్తూరు, గుడిపాల, యాదమర్రి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమర్, బంగారుపాలెం, తవనంపల్లె, ఇర్లా, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, వడమాలపేట, పాలసముద్రం, పుత్తూరు, కార్వేటినగర్, నగరి, నిండ్ర, విజయాపురం మండలాలు ఇందులో ఉంటాయి. 12. రాజమహేంద్రవరం మొత్తం 10 మండలాలతో ఏర్పాటు కానున్న ఈ డివిజన్లో రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం గ్రామీణ, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేటతోపాటు రామచంద్రాపురం డివిజన్ నుంచి అనపర్తి, బిక్కవోలు, కాకినాడ నుంచి పెదపూడి, పెద్దాపురం డివిజన్ నుంచి రంగంపేట మండలాలతో ఇది ఏర్పాటు కానుంది. 13. కొవ్వూరు మొత్తం 10 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లితో పాటు ఏలూరు డివిజన్ నుంచి ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం డివిజన్ నుంచి గోపాలపురం మండలం ఈ డివిజన్ పరిధిలోకి వెళతాయి. 14. ఏలూరు మొత్తం 12 మండలాలు. ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరంతో పాటు కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌కు చెందిన కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 15. నూజివీడు 6 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరుతోపాటు ఏలూరు డివిజన్‌కు చెందిన చింతలపూడి, లింగంపాలెం మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 16. జంగారెడ్డిగూడెం 9 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. ఏలూరు డివిజన్‌కు చెందిన కామవరపుకోట, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్ నుంచి జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు డివిజన్ నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవుతుంది. 17. గుంటూరు ఈ డివిజన్లో 10 మండలాలు ఉంటాయి. తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. 18. తెనాలి 8 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు కానుంది. తెనాలి డివిజన్ నుంచి తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను, గుంటూరు డివిజన్ నుంచి మంగళగిరి, తాడేపల్లి మండలాలు ఇందులో ఉంటాయి. 19. పెద్దాపురం పెద్దాపురం డివిజన్ 12 మండలాలతో ఉంది. ఇప్పటికే ఉన్న పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, తొండంగి, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలతో పాటు రాజమండ్రి డివిజన్ నుంచి గోకవరం మండలం చేరనుంది. 20. కాకినాడ ఈ డివిజన్లో మొత్తం ఏడు మండలాలు ఉంటాయి. అందులో సామర్ల్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ మండలాలు ఇందులో ఉంటాయి. 21. అమలాపురం ఈ డివిజన్ మొత్తం 16 మండలాలతో ఉంది. ఇందులో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాలు ఇందులో ఉంటాయి. 22. రామచంద్రాపురం ఈ డివిజిన్ 8 మండలాలతో ఉంటుంది. రామచంద్రాపురం డివిజన్లోని రామచంద్రాపురం, కాజులూరు, పామర్రు (కె.గంగవరం), మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలతో పాటు కాకినాడ డివిజన్ నుంచి తాళ్లరేవు, రాజమండ్రి డివిజన్ నుంచి ఆలమూరు మండలాలు ఇందులోకి వస్తాయి. 23. మచిలీపట్నం ఇది 12 మండలాలతో ఉంది. ఇందులో పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, మొవ్వ మండలాలు ఈ డివిజన్ పరిధిలో ఉంటాయి. 24. గుడివాడ ఈ డివిజన్లో మొత్తం 13 మండలాలు ఉంటాయి. గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు మండలాలతో పాటు, విజయవాడ డివిజన్ పరిధిలోని పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, నూజివీడు డివిజన్లోని ఉయ్యూరు, పమిడిముక్కల, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 25. కర్నూలు ఈ డివిజన్ మొత్తం 11 మండలాలతో ఉంటుంది. ప్రస్తుత కర్నూలు డివిజన్లోని కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో పాటు నంద్యాల డివిజన్లోని పాణ్యం, గడివేముల మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 26. ఆదోని ఈ డివిజన్లో 17 మండలాలు ఉంటాయి. ప్రస్తుత ఆదోని డివిజన్లోని ఆదోని, మంత్రాలయం, పెదకడుబూరు, కోసిగి, కౌతాలం, ఆలూరు, దేవనకొవడ, హోలగుండ, హలహర్వి, ఆస్పిరి, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 27. పాలకొండ ఇందులో శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 28. పార్వతీపురం మొత్తం 10 మండలాలతో ఉంటుంది. ఇందులో ప్రస్తుత పార్వతీపురం డివిజన్లోని పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు, విజయనగరం డివిజన్లోని మెంటాడ దీని పరిధిలోకి వస్తాయి. 29. నంద్యాల ఈ డివిజన్లో 9 మండలాలు ఉంటాయి. ప్రస్తుత నంద్యాల డివిజన్లోని నంద్యాల, గోస్పాడు, సిర్వేల్, డోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ మండలాలతో ఈ డివిజన్ యథాతథంగా ఉంటుంది. 30. నెల్లూరు నెల్లూరు డివిజన్ 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ఇందులో నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 31. కావలి ఈ డివిజన్లో 12 మండలాలు ఉంటాయి. ప్రస్తుత కావలి డివిజన్లోని కావలి, బోగోలు, ఆలూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కొండాపురం మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్లోని కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 32. ఆత్మకూరు ఆత్మకూరు డివిజన్ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత ఆత్మకూరు డివిజన్లో ఉన్న ఆత్మకూరు, చేజెర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు మండలాలతో పాటు ప్రస్తుత కావలి డివిజన్లోని వరికుంటపాడు, దత్తులూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 33. విజయవాడ విజయవాడ డివిజన్ 6 మండలాలతో ఏర్పాటు కానుంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, రూరల్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం మండలం దీని పరిధిలోకి రానుంది. 34. పాడేరు పాడేరు డివిజన్ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ఈ డివిజన్లో అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచింగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 35. రంపచోడవరం రంపచోడవరం డివిజన్ 11 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత రంపచోడవరం డివిజన్ పరిధిలోని రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలతో పాటు ప్రస్తుత ఎటపాక డివిజన్ పరిధిలో గల ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 36. గురజాల గురజాల డివిజన్ 14 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత గురజాల డివిజన్ పరిధిలోని గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలతో పాటు ప్రస్తుత గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 37. నరసరావుపేట నరసరావుపేట డివిజన్ 14 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత నరసరావుపేట డివిజన్ పరిధిలోని నకిరికల్లు, చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నరసరావుపేట, రొంపిచెర్ల, వినుకొండ, బోళ్లపల్లె, నూజెండ్ల, శావల్యాపురం, ఐపూరు మండలాలతో పాటు ప్రస్తుత గుంటూరు డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి. 38. ఒంగోలు ఒంగోలు డివిజన్ 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత ఒంగోలు డివిజన్లోని ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పాలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్ పరిధిలోని మర్రిపూడి, కొండెపి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. 39. మార్కాపురం మార్కాపురం డివిజన్ 13 మండలాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత మార్కాపురం డివిజన్ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రేచర్ల, కొమరోలు, కుంబం, ఆర్దవీడు, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు మండలాలతో పాటు ప్రస్తుత కందుకూరు డివిజన్లోని తుర్లపాడు దీని పరిధిలోకి రానుంది. 40. కడప ఈ డివిజన్లో 10 మండలాలు ఉంటాయి. కడప, చక్రాయపేట, యర్రగుంట్ల, వీరాపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూర్, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి మండలాలు, ప్రస్తుత జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లోని వేంపల్లి మండలం దీని పరిధిలోకి చేరతాయి. 41. జమ్మలమడుగు దీని పరిధిలో 12 మండలాలు ఉంటాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం దీని పరిధిలోకి వస్తాయి. 42. బద్వేలు ఈ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉంటాయి. ప్రస్తుత జమ్మలమడుగు డివిజన్లోని ఎస్.మైదుకూరు, దువ్వూరు, చాపాడు మండలాలు, ప్రస్తుత రాజంపేట డివిజన్లోని ఎస్వీ కాశీనాయన, కలాసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, బ్రహ్మంగారిమఠం, అట్లూరు, ప్రస్తుత కడప డివిజన్లోని ఖాజీపేట ఈ డివిజన్ పరిధిలో చేరనున్నాయి. 43. నరసాపురం దీని పరిధిలో 8 మండలాలు ఉంటాయి. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, అచంట.. ప్రస్తుత కొవ్వూరు డివిజన్ నుంచి పెనుగొండ, పెనుమంట్ర మండలాలు దీని పరిధిలో చేరతాయి. 44. విశాఖపట్నం ఈ డివిజన్ పరిధిలో 5 మండలాలు ఉంటాయి. గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగాడ, సీతమ్మధార మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 45. విజయనగరం ఈ డివిజన్ పరిధిలో 15 మండలాలు ఉంటాయి. విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి, గుర్ల మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 46. టెక్కలి దీని పరిధిలో 14 మండలాలు ఉంటాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, జలుమూరు, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, ప్రస్తుత పాలకొండ డివిజన్ పరిధిలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు దీని కిందకు వస్తాయి. 47. శ్రీకాకుళం 16 మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవుతుంది. శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పోలాకి, ఎల్ఎన్ పేట, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ప్రస్తుత పాలకొండ డివిజన్లోని సారవకోట, హిరమండలం, కొత్తూరు మండలాలు దీని పరిధిలో చేరతాయి. 48. ధర్మవరం ఈ డివిజన్ 4 మండలాలతో ఏర్పాటు కానుంది. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 49. పెనుకొండ దీని పరిధిలో 13 మండలాలు ఉంటాయి. పెనుకొండ, పరిగి, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగిళి మండలాలు దీని పరిధిలో ఉంటాయి. 50. కుక్కునూరు పోలవరం విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుంది. 51. ఎటపాక విలీన మండలాలైన కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటవుతుంది. -
కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మెదక్ జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడను నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచి్చన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని డివిజన్లు, మండలాలకు లైన్‌క్లియర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా చౌట్కూరు మండలం ప్రతిపాదిత జోగిపేట రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలను ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం సంగారెడ్డి డివిజన్లో కొనసాగుతున్న అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలతోపాటు కొత్తగా చౌట్కూరు మండలాన్ని ఏర్పాటు చేసింది. పుల్కల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను తొలగించి చౌట్కూరు మండలంలో కలిపింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 586కు చేరింది. వేములవాడ డివిజన్ ఇలా.. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న 6 మండలాలతో వేములవాడ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో వేములవాడ, వేములవాడ (గ్రామీణ), చందూర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రండి మండలాలున్నాయి. ఇదిలావుండగా డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. -
తెరపైకి కొత్త డివిజన్
ఇచ్చోడ(బోథ్): ఇచ్చోడ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేయాలనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్ రెండు డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో బోథ్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలు, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో 13 మండలాలు ఉండడంతో పని భారంతోపాటు బోథ్‌లోని మండలాల ప్రజలకు దూరభారం కూడా అవుతోంది. కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడే ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది. కాని కొన్ని కారణాలతో తెలంగాణాలో కొత్తగా డివిజన్ ఏర్పాటు కాలేదు. సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మరికొన్ని కొత్త మండలాతోపాటు అవసరం ఉన్న చోట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త రెవెన్యూ డివిజన్ల అంశం తెరపైకి వచ్చింది. అయితే అన్నిసౌకర్యాలు ఉన్న ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డివిజన్ ఏర్పాటు చేయాలని తీర్మానం.. ఇచ్చోడ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పా టు చేయాలని ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. యువజన సంఘాల ఆధ్వర్యంలోనూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే పలు యువజన సంఘాలతోపాటుగా రాజకీయ పార్టీలు కూడా ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేస్తున్నాయి. ఇచ్చోడ ఏర్పాటుతో తగ్గనున్న దూర భారం ఇచ్చోడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల మండలాలకు దూర భారం తగ్గనుంది. కొత్తగా ఏర్పాటు అయిన సిరికొండ మండలం ఇచ్చోడకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పక్కనున్న బజార్హత్నూర్ మండలం కూడా ఇచ్చోడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిహత్నూర్, నేరడిగొండ మండలాలు కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బోథ్ మండలానికి ఇచ్చోడ మండలానికి 25 కిలో మీటర్లు దూరం ఉంటుంది. ఇచ్చోడ మండలానికి ఐదు మండలాలు పది నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు జాతీయ రహదారిపై ఉండడం అన్ని మండలాలకు సెంటర్ పాయింట్ ఇచ్చోడ కావడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సమీప మండలాల ప్రజలు సుముఖంగా ఉన్నారు. దీంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వాదన తెరపైకి వస్తోంది. కొత్త డివిజన్లపై ప్రభుత్వ కసరత్తు... సీఎం కేసీఆర్ ఆదేశాలతో కొత్తగా డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనతో ఆదిలాబాద్‌లో రెవెన్యూ డివిజన్ ఒక్కటే కావడంతో అటు అధికారులకు, ఇటు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్తగా డివిజన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాలన సౌలభ్యంతోపాటు దూరంభారం తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, బోథ్ ఆరు మండలాల కలిపి ఇచ్చోడ రెవెన్యూ ఏర్పాటు కానుంది. -
పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగానికి తెర
- పత్తికొండ, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం – జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నంద్యాలరూరల్: జిల్లాలో నూతన భారీ పరిశ్రమ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయ పునః ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరుకు చేసేందుకు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మరికొన్నింటిని అర్బన్ మండలాలుగా ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నంద్యాల, కొలిమిగుండ్ల తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు అభినందనీయమని, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర తహసీల్దార్ కార్యాలయాల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఒక్కో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం రూ.60లక్షలతో దొర్నిపాడు, చాగలమర్రి, ఆళ్లగడ్డకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ఓర్వకల్లు మండలం శకునాల గ్రామం వద్ద 2వేల ఎకరాల్లో వెయ్యి మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని ఇదే ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల వెయ్యిమందికి ఉద్యోగాలు లభిస్తాయని, జూపాడు బంగ్లా మండలం, తంగడంచె వద్ద ప్రభుత్వం జైన్ ఇరిగేషన్ కంపెనీతో మెగా ఫుడ్‌పార్కు, అంబుజ కంపెనీ ద్వారా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పామని, ఈ పరిశ్రమల వల్ల మరో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వానికి భూమి అప్పగించిన జిల్లాలో మొదటి గుంటూరు కాగా రెండవది కర్నూలు జిల్లానేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ సుబ్బారెడ్డి, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శివరామిరెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేరుకే డివిజన్
నెల రోజులైనా ఏర్పాటుకాని కార్యాలయాలు ఇన్ చార్జి ఆర్డీఓ, ఇన్ చార్జి డీఎస్పీతో పాలన మిగతా శాఖల అధికారుల నియామకంపై ఊసెత్తని ప్రభుత్వం మండలాల్లో కాని పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళుతున్న ప్రజలు తొర్రూరు : పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్డీఓ, డీఎస్పీ, రిజిషే్టష్రన్, ఎస్టీఓ, ఫైర్‌స్టేçÙన్, పోస్టుమార్టం ఆస్పత్రి, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, చిన్నతరహా, భారీ నీటి పారుదల, విద్యా, వైద్య, వ్యవసాయ, విద్యుత్, హర్టీకల్చర్, ఐసీడీఎస్, ఐకేపీ, డీఆర్డీఏ, లేబర్, డీఎల్పీఓ, ఆర్టీఏ, మత్య్క పారిశ్రామిక, ఎక్సైజ్, సివిల్ సప్లై, విజిలెన్స్, పశు వైద్య వంటి అన్నిశాఖల డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటవుతాయని, తద్వారా అన్నిశాఖల సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో అన్నివర్గాల ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. అయితే డివిజన్ ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా కేవలం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాల ప్రారంభం తప్ప, ఇప్పటికి సుమారు ముప్పై శాఖల్లో ఏ ఒక్కశాఖ కార్యాలయాన్ని కుడా ప్రారంభించిన దాఖాలాలు లేవు. ప్రారంభించిన కార్యాలయాల్లో పరిపాలన శూన్యం .. తొర్రూరులో ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్ ఆర్డీఓను నియమించినప్పటికి ఆయా మండలాలకు చెందిన సంబంధిత ఫైల్స్ ఇంకా రాకపోవడంతో ఆర్డీఓ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అంతేకాకుండా డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్ డీఎస్పీని నియమించినప్పటికి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా సంబంధత డీఎస్పీ కార్యాలయాన్ని తెరిచిన దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో నెలరోజులు గడుస్తున్నా పరిపాలన సాగకపోవడంతో అసలు కొత్త కార్యాలయాల పాలన ఉంటుందో, ఉండదోనని ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రతి కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. -
లెక్క తేలింది
సామాజిక పింఛన్ల విభజన నిజామాబాద్‌కు 2,35,321 మంది లబ్ధిదారులు కామారెడ్డికి 1,47,210 మంది.. ఆధార్ లేకుంటే నిలిపివేత ఇందూరు : కొత్త జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లు, మండలాలతో అన్ని శాఖల్లో విభజన పూర్తయింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలూ వేరు చేయబడ్డాయి. అయితే సం క్షేమ పథకాల్లో ముఖ్యమైన ఆసరా, వికలాంగ, బీడీ తదితర పింఛన్లు పొందే లబ్ధిదారుల వివరాలు గ్రామాల మార్పు లు, చేర్పులతో మొన్నటి వరకు విభజన జరగలేదు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కలిసి ఒకే లాగిన్, కోడ్‌తో బడ్జెట్ రావడం, పంపి ణీ ఎప్పటిలాగే జరిగింది. ప్రస్తుతం పింఛన్‌దారులను నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారీగా వేరు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా కోడ్, లాగిన్లు, బడ్జెట్లను కేటాయించారు. ఏ జిల్లాకు ఎంత మంది ? పింఛన్‌దారుల లెక్కలను తేల్చారు. ఉమ్మడి జిల్లాలో 3,82,531 మంది పింఛన్‌దారులు ఉండగా, వీరికి నెలకు ప్రభుత్వం రూ. 39 కోట్ల 61లక్షల నిధులను ఖర్చు చేసేది. ప్రస్తుతం తేలిన లెక్కల ప్రకారం పింఛన్ లబ్ధిదారుల వివరాలు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం పింఛన్లు 2,35,321 మంది ఉండగా వీరికి ప్రతి నెల రూ.24కోట్ల 21లక్షలు ఖర్చు అవుతాయి. కామారెడ్డి జిల్లాలో 1,47,210 మందికి గాను రూ.15కోట్ల 40 లక్షలు ఖర్చు అవుతున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. జనవరి నుంచి.. సామాజిక భద్రతా పింఛన్ పథకం ‘ఆసరా’కు ఆధార్‌ను నూటికి నూరు శాతం అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేటాగిరీల వారీగా ఆధార్ లేకుండా పింఛన్లు పొందుతున్న వారి వివరాలను మరోసారి సేకరించాలని సెర్ప్ అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. ఆధార్ లేని వారికి జనవరి నాటికి ఆధార్‌ను అసంధానం చేయాలని లబ్ధిదారులకు తెలియజేయాలని, లేదంటే పింఛన్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేయాలని తెలిపినట్లు సమాచారం. జిల్లాలో ఆధార్ లేని వారు సుమారు 13 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పక్రియతో పలు బోగస్ పింఛన్లు తొలిగిపోయే అవకాశం ఉంది. -
కమీషన్లు వచ్చే పనులకే బిల్లులు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రైతులను, పేదలను పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే పనులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోం దని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బిల్లుల చెల్లింపుల్లోనూ వివక్ష చూపిస్తోందన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయడంలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దాపరికంగా ఎందుకన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్‌ను పాటించలేదన్నారు. బాధ్యులపై సీఎస్‌కు ఫిర్యాదు చేస్తామని పొంగులేటి చెప్పారు. -
అర్ధరాత్రి తర్వాత కొత్త జిల్లాల ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జారీ చేసింది. హైదరాబాద్ మినహాయిస్తే...రాష్ట్రంలోని మిగిలిన 9 జిల్లాలను 30 కొత్త జిల్లాలుగా పునర్విభజిస్తూ జిల్లాల వారీగా తుది ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్ చంద్ర జారీ చేశారు. ఆ వెంటనే కొత్త జిల్లాలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, కొత్తగా ఏర్పడిన 6 పోలీసు కమిషనరేట్లకు పోలీసు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు మూకుమ్మడిగా ఉత్తర్వులు జారీ చేశాయి. -
కొత్త డివిజన్లు, మండలాలు ఇవే
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెవెన్యూ డివిజన్లు, మండలాలకు అదనంగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వం కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న డివిజన్లు, మండలాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి. వాటిల్లోని కొన్ని మండలాలు, గ్రామాలను విడదీసి ఈ కొత్త డివిజన్లు, మండలాలను అదనంగా ఏర్పాటు చేశారు. 125 కొత్త మండలాలు.. ♦ ఆదిలాబాద్ (5): ఆదిలాబాద్ రూరల్, మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ ♦ మంచిర్యాల (4): భీమారం, నస్పూర్, హాజీపూర్, కానేపల్లి ♦ నిర్మల్ (6): నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్ (జి), దస్తూరాబాద్, బాసర ♦ ఆసిఫాబాద్ (కొమురంభీం)(3): లింగాపూర్, పెంచికల్‌పేట, చింతలమానేపల్లి ♦ కరీంనగర్ (4): కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, గన్నేరువరం, ఇల్లందకుంట ♦ జగిత్యాల (3): జగిత్యాల రూరల్, బీర్పూర్, బుగ్గారం ♦ పెద్దపల్లి (3): అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్ ♦ సిరిసిల్ల (4): సిరిసిల్ల రూరల్, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి ♦ మహబూబ్‌నగర్ (5): మూసాపేట, మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్(బి), మరికల్, కృష్ణ ♦ వనపర్తి జిల్లా (5): అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నంబావి, శ్రీరంగపూర్ ♦ నాగర్‌కర్నూల్ (4): పెంట్లవెల్లి, ఊర్కొండ, పదర, చారుకొండ ♦ గద్వాల (జోగులాంబ) జిల్లా (3): కోటిదొడ్డి, రాజోలి, ఉండవల్లి ♦ వరంగల్ అర్బన్ (4): ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, ♦ వరంగల్ రూరల్ (1): దామెర ♦ భూపాలపల్లి (జయశంకర్) జిల్లా (3): టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల ♦ మహబూబాబాద్ (4): గంగారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర ♦ జనగాం జిల్లా (2): తరిగొప్పుల, చిల్పూరు ♦ సిద్దిపేట జిల్లా (5): సిద్దిపేట రూరల్, మర్కూక్, రాయపోల్, కొమురవెల్లి, హుస్నాబాద్ రూరల్ (అక్కన్నపేట) ♦ మెదక్(5):హవేలీఘన్పూర్, నిజాంపేట, మనోహరాబాద్,చిల్పిచేడ్, నార్సింగి ♦ సంగారెడ్డి (7): కంది, అమీన్పూర్, గుమ్మడిదల, వట్పల్లి, మొగుడంపల్లి, సిర్గాపూర్, నాగల్గిద్ద ♦ నిజామాబాద్ (8): నిజామాబాద్ (నార్త్), నిజామాబాద్ రూరల్, ముగ్పల్, మెండోరా, రుద్రూరు, ఇందల్వాయి, ముక్కల్, ఎరగట్ల ♦ కామారెడ్డి (5): రాజంపేట, బీవీపేట, రామారెడ్డి, పెద్ద కొడంగల్, నస్రుల్లాబాద్ ♦ నల్లగొండ(5): మాడ్గులపల్లి, తిర్మలగిరి సాగర్, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, అడవిదేవులపల్లి ♦ సూర్యాపేట (5): నాగారం, మద్దిరాల, పాలకీడు, అనంతగిరి, చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం) ♦ యాదాద్రి జిల్లా (2): అడ్డగూడూరు, మోటకొండూరు ♦ ఖమ్మం జిల్లా (1): రఘునాథపాలెం ♦ భద్రాద్రి (కొత్తగూడెం)(6): సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కర్కగూడెం ♦ వికారాబాద్ జిల్లా (1): కోట్‌పల్లి ♦ శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా)(6): బాలాపూర్, కడ్తాల్, అబ్దుల్లాపూర్, గండిపేట, చౌదరిగూడెం, నందిగామ ♦ మేడ్చల్ జిల్లా (6): అల్వాల్, దుండిగల్ గండి మైసమ్మ, బాచుపల్లి(నిజాంపేట), కూకట్పల్లి, కాప్రా, మేడిపల్లి (ఒక్క హైదరాబాద్ జిల్లాలో మాత్రం కొత్త మండలాలేమీ ఏర్పాటు చేయలేదు) -
మండలాల కోసం లొల్లి
మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మానుకోట నాయకుల డిమాండ్ ప్రభుత్వంపై ఒత్తిడికి సన్నద్ధం మహబూబాబాద్ : మానుకోట జిల్లా కోసం తీవ్రస్థాయిలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ముసాయిదా లో మానుకోట పేరు ప్రకటించగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ పలు గ్రామాల ను మండలాలు చేయాలని, రెవెన్యూ డివిజన్లు చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆయా డిమాండ్ల సాధనకు నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. మానుకోట జిల్లా 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ఇందు లో మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, ములుగు డివిజన్లోని కొత్తగూడ మండలాలు ఉన్నాయి. 7,54, 845 జనాభా, 3463.89 కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. పాత రెవెన్యూ డివిజన్లో 16మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మండలాలు తగ్గించారు. అయితే మండలాల సంఖ్య కనీసం 16కు పెంచాలని, మానుకోట తోపాటు మరో రెవె న్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రాజ కీయ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ కోసం... కేసముద్రం మండలం ఇనుగుర్తి, మరిపెడ మండలం చిన్నగూడూరు గ్రామాలు మండలాలుగా, తొర్రూరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, పారిశ్రామికవాడగా మార్చేందుకు ఇల్లందును కూడా మానుకోటలో చేర్చాలంటూ మానుకోట జిల్లా సాధన కమిటీ తాజా గా డిమాండ్ చేస్తోంది. కొత్తగూడెం నుంచి బయ్యారం, ఇల్లందు మధ్య సుమారు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజ సంపద ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపాలని డిమాండ్ వస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా చేయాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు జిల్లా సాధన కమిటీ నాయకులు మద్దతు తెలిపారు. ఇల్లందు కలపాలని... జిల్లాల పునర్విభజన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మానుకోటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మరుసటి రోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపడంతోపాటు రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రంగా, మరిపెడను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మండలఅధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు మానుకోట మండలం వీఎస్.లక్ష్మీపురం, జంగిలిగొండ, సింగారం గ్రామాలను ఇతర మండలాల్లో కలిపే ప్రయత్నాలు చేశార ని ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలు మానుకోట మం డలంలోనే ఉండటంతో ఆందోళన విరమించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రం చేసి దాశరథి పేరు పెట్టాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా చేస్తే మానుకోట మండలంలోని కొన్ని గ్రామాలు కలిపే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఆయా గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలవుతాయి. మానుకోట జిల్లా ఏర్పాటులో తొర్రూరు రెవెన్యూ డివిజన్‌గా చేయాలని అన్నిపార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లందును మానుకోట జిల్లాలో కలపాలనేది అందరికీ ఆమోదంగానే ఉంది. -
హన్మకొండ నాలుగు ముక్కలు
పది గ్రామాలతో కాజీపేట మండలం హన్మకొండలో మిగులనున్న ఆరు గ్రామాలు హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేసింది. దాదాపు రాత్రి 11గంటల వరకు డీఆర్వో శోభ, పలువురు తహశీల్దార్లు ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తంగా సోమవారం వెలువడనున్న ముసాయిదా ప్రకటనలకు కసరత్తు పూర్తి చేశారు. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ మండలంలోని పలు గ్రామాలతోపాటు ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామాన్ని కలిపి కొత్తగా కాజీపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. చుట్టుపక్కల ఉన్న 10 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటుకానుంది. 10 గ్రామాలు... 1.52లక్షల జనాభా కొత్తగా ఏర్పడబోయే కాజీపేట మండలంలో గతంలో ప్రసుతం హన్మకొండ మండలంలో ఉన్న న్యూశాయంపేట, కాజీపేట, సోమిడి, మడికొండ, తరాలపల్లి, భట్టుపల్లి, కొత్తపల్లి, అమ్మవారిపేట, కడిపికొండ గ్రామాలతో పాటు ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామాన్ని కూడా కలుపుతున్నారు. ఆయా పది గ్రామాల మొత్తం జనాభా 1.52,372గా ఉంది. ప్రస్తుతం అధికారులు 2011నాటి జనాభా లెక్కల ప్రకారం మండలాల ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. అయితే, తాజా లెక్కల ప్రకారం జనాభా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఖిలా వరంగల్‌కు మూడు గ్రామాలు... ప్రస్తుతం హన్మకొండ మండంలోని పైడిపల్లి, ఏనుమాముల, కొత్తపేట రెవెన్యూ గ్రామాలు ప్రస్తుతం ఉన్న వరంగల్ మండలంలో కలుపుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరంగా ఈ గ్రామాలు వరంగల్ మండలానికి సమీపంలో ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో జనాభా సుమారు 30వేల వరకు ఉంటుంది. అలాగే, హన్మకొండ మండలంలోని మామునూరు, నక్కలపల్లి, తిమ్మాపూర్, అల్లీపూర్ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే ఖిలావరంగల్ మండలంలో కలపాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాల జనాభా సుమారు 20వేల వరకు ఉంటుంది. ఇక వర్ధన్నపేట మండలం నుంచి కొత్తగా ఏర్పడనున్న ఐనవోలు మండలంలో హన్మకొండ మండలం నుంచి కొండపర్తి, వనమాల కనపర్తి గ్రామాలు కలుపనున్నారు. ఈ రెండు గ్రామాల్లో జనాభా 8,481 ఉంది. అంతేకాకుండా హన్మకొండ మండలంలోని 24 రెవెన్యూ గ్రామాలకు గాను కొత్తగా ఏర్పడబోయే కాజీపేటకు తొమ్మిది గ్రామాలు, ఖిలా వరంగల్‌లోకి నాలుగు, ఐనవోలులోకి రెండు, పాత వరంగల్‌కు మూడు గ్రామాలు కలుపుతున్నారు. దీంతో హన్మకొండ పాత మండలంలో కేవలం ఆరు రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగులుతాయి. ఇలా హన్మకొండ మండలం నాలుగు ముక్కలు కానుంది. అయినా 2.32 లక్షల జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం హన్మకొండ మండల జనాభా 4.32లక్షలుగా ఉంది. అయితే, మండల ఏర్పాటు, విభజనలో మండలంలోని 24 గ్రామాల నుంచి 18 గ్రామాలు విడిపోతాయి. ఇవిపోను హన్మకొండ, వడ్డేపల్లి, కుమార్‌పల్లి, గోపాలపురం, లష్కర్‌సింగారం, పలివేల్పుల రెవెన్యూ గ్రామాలతో హన్మకొండ మండలం మిగులుతుంది. అయినప్పటికీ ఆరు గ్రామాలు, 2.32లక్షల జనాభాతో పాత, కొత్త మండలాల్లో కలిపి జనాభాపరంగా జిల్లాలో హన్మకొండ పెద్ద మండలంగా మిగలనుంది. -
కొన్ని మార్పులు
జిల్లాల పునర్విభన ముసాయిదాకు తుదిరూపు వరంగల్, హన్మకొండలో 14 చొప్పున మండలాలు హన్మకొండ జిల్లాలోకి పాలకుర్తి, కొడకండ్ల జయశంకర్ జిల్లాలోకి శాయంపేట మహబూబాబాద్‌లోనే కొత్తగూడ కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లు సాక్షిప్రతినిధి, వరంగల్ : అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై ముసాయిదా సిద్ధమైంది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తుది ముసాయిదాలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 16 మండలాలతో వరంగల్ జిల్లాను, 12 మండలాలతో హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదనలు చేశారు. తాజా మార్పుల ప్రకారం... వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 14 చొప్పున మండలాలు ఉంటున్నాయి. ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పేమీ జరగలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం శాయంపేట మండలం ఆచార్య జయశంకర్ జిల్లాలో కలవనుంది. వరంగల్ జిల్లాలో కొనసాగించాలని ఆ మండల ప్రజలు పోరాటాలు చేసినా ప్రతిపాదనల్లో మాత్రం దీనికి విరుద్ధంగానే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపేలా, రాయపర్తి మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగూడ మండలాన్ని మొదట పేర్కొనట్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే కలపనున్నారు. జిల్లాల వారీగా మండలాలు... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, రాయపర్తి. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల. యాదాద్రి జిల్లా : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట. సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా.. ప్రతిపాదిత నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును ముసాయిదాలో పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హన్మకొండ జిల్లాలో హన్మకొండ, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు... నర్సంపేట : నెక్కొండ, పరకాల, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట. వరంగల్ : ఆత్మకూరు, గీసుగొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట. హుజూరాబాద్ : భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. హన్మకొండ : రఘునాథపల్లి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, నర్మెట. భూపాలపల్లి : కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి. ములుగు : ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : బయ్యారం, గార్ల, డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ. జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, మోటకొండూరు(న్యూ), రాజాపేట, అడ్డగూడురు(న్యూ), మోత్కూరు. -
నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్..
సాక్షిప్రతినిది, నిజామాబాద్ : జిల్లాల పునర్విభజనపై సోమవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశంలో.. మన జిల్లా విభజనకు సంబంధించి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా చేసిన పలు ప్రతిపాదనలకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. అయితే జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, భౌగోళిక పరిస్థితులు, ఆయా మండలాల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాలకు సంబంధించి కలెక్టర్ రూపొందించిన నివేదికపై మాత్రం సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్లు నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కలెక్టర్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ అంశాలకు సంబంధించి వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు చేశారు. కొత్త మండలాల ఏర్పాటు, డివిజన్ల ఏర్పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విన్నపాలు, ప్రజాప్రతినిధులు, సూచనలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను కలెక్టర్ సీఎస్‌కు అందించారు. జిల్లా పునర్విభజనలో భాగంగా ఏర్పడే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాకు చెందిన మండలాలు ఇతర జిల్లాల్లో కలిపే తదితర అంశాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ నివేదికలను పరిశీలించిన సీఎస్ మాత్రం నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. తొలి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు సమర్పించిన నివేదికలపై కూడ అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే పునర్విభజన కొనసాగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్లకు తెలిపినట్లు సమాచారం. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, 10 మండలాల ఏర్పాటుపై మాత్రం స్పష్టత వచ్చినట్లు తెలిసింది. జిల్లా ఏర్పాటులో భాగంగా మొదట అనుకున్న ప్రకారం కామారెడ్డిలో నాలుగు నియోజక వర్గాలు, నిజామాబాద్‌లో 5 నియోజక వర్గాలు ఉండే విధంగా కలెక్టర్ నివేదించడంపై సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జూలై 5న మరోమారు జిల్లా కలెక్టర్లతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. కలెక్టర్ సూచించిన నివేదికలను పరిశీలించి ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్ మరికొన్ని విన్నపాలను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ల నివేదికల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. కలెక్టర్లతో సమావేశం ముగియగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకువచ్చే ఉత్తర్వులు జారీ చేస్తారన్న చర్చ సాగుతోంది. ముగిసిన మొదటి రోజు సమావేశం.. హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల మొదటిరోజు సమావేశం ముగియగా.. ఎలాంటి నిర్ణయాలు మాత్రం వెలువడ లేదు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన అధికారులు...‘పునర్విభజన ప్రక్రియలో ముందుకు సాగండి’ అని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు ఇక పునర్విభజన ప్రతిపాదనలపై ఏమీ మాట్లాడకుండా కొత్తగా ఏర్పడే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల్లో భవనాల నిర్మాణం, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు, అధికారులు, ఉద్యోగుల విభజనపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జిల్లాకు సంబంధించి భౌగోళిక పరిస్థితులు, జనాభా, భూగర్భవనరులు, రేఖాచిత్రాలు, ఉద్యోగుల విభజన పలు అంశాలపై వారు మరింత దృష్టి పెట్టనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకురావడం , కార్యాలయాలు, ఉద్యోగుల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను వేగవంతం చేసే అవకాశం కూడ ఉంది. వీటన్నింటితో మారోసారి జులై 5 సమావేశం అనంతరం వీటికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారన్న చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగానే కలెక్టర్లు కూడా విభజన అంశాల్లో మరింత వేగం పెంచి ప్రాంతాలు విభజన కొత్త మండలాలు, రెవెన్యూ మండలాల, కార్యాలయాలను ప్రారంభించడం వంటి ముఖ్యమైన అంశాలను ఒక కొలిక్కి తీసుకు రావాల్సి ఉంది. దసరా కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు మరింత వేగంగా జరుగనున్నాయి. వచ్చే నెలలో సమావేశం తర్వాత పునర్విభజనపై పూర్తి స్పష్టత రానుంది. నిజామాబాద్ మండలాన్ని నిజామాబాద్ అర్బన్, రూరల్‌గా, బోధన్ మండలాన్ని అర్బన్, రూరల్‌గా, ఆర్మూర్ మండలాన్ని ఆర్మూర్, ఆలూర్గా, కామారెడ్డిని కామారెడ్డి, దేవునిపల్లిగా విభజించనున్నారు. వర్ని మండలంలోని రుద్రూర్ను మండల కేంద్రం చేయనున్నారు. అలాగే దోమకొండలోని బీబీపేట, భిక్కనూరులోని రాజంపేట, సదాశివనగర్ మండలంలోని రామారెడ్డిని మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి మరో మండలం చేసే అవకాశాలున్నాయి. -
కొత్త జిల్లాలపై కమిటీ
♦ సీఎస్ రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఐదుగురితో ఏర్పాటు ♦ రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణపైనా పరిశీలన ♦ జూన్ 2 నాటికి ప్రక్రియ పూర్తికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణపై కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ సారథ్యంలో రెవెన్యూ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. భూపరిపాలనా విభాగం ముఖ్య కమిషనర్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, ప్రణాళిక శాఖ, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పర్యావరణ అటవీశాఖ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పునర్వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్2 వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పెరగనున్న డివిజన్లు, మండలాలు ప్రస్తుతం రాష్ట్రంలోని పదిజిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 464 మండలాలు ఉన్నాయి. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. రాష్ట్రంలో 35 లక్షల జనాభాకో జిల్లా ఉంది. దీంతో ఇప్పుడున్న జిల్లాల సంఖ్యను రెండింతలకు పైగా పెంచే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య కూడా పెరగనుంది. జనాభాతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు ఆ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయాలతో పాటు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు మౌలిక వసతులున్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. నేతలకు గుబులు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ రాజకీయంగా తమ భవితవ్యానికి ఇబ్బంది కలిగించే ప్రమాదముందని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పునర్వ్యవస్థీకరణతో ఇప్పుడున్న పార్లమెంటు నియోజకవర్గాలు కుదుపులకు గురవడం ఖాయం. కొన్ని సెగ్మెంట్లు రెండు, మూడు జిల్లాలకు విస్తరించే పరిస్థితులున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం ఏదో ఒక జిల్లాలోనే ఉంచాలని భావిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కోణంలోనూ కమిటీ అధ్యయనం చేయనుంది. తెరపైకి కొత్త డిమాండ్లు కొత్తజిల్లాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగాం, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లను జిల్లాలుగా మార్చాలని పట్టుబడుతున్నారు. -
బోరుమంటున్న రైతన్న
అనంతపురం అగ్రికల్చర్ : నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపించక పోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాకాలంలో కూడా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడం పరిస్థితిని మరింత జఠిలం చేస్తోంది. జిల్లాలో 73 ప్రాంతాల్లో బోరుబావులతో అనుసంధానించిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జల శాఖ అధికారులు సేకరించిన గణాంకాలను బట్టి చూస్తే తాజా సగటు నీటిమట్టం 19.22 మీటర్లుగా నమోదైంది. బోరు బావుల్లో నీరు అడుగంటడంతో వరి సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఉద్యాన తోటలు, పశుగ్రాసం పెంపకం, పాడి పరిశ్రమ అభివ ృద్ధికి అవరోధంగా తయారైంది. సాగు, తాగునీటికీ తిప్పలు తప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. అనంతపురం, ధర్మవరం, కదిరి రెవెన్యూ డివిజన్లలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా కళ్యాణదుర్గం, పెనుకొండ డివిజన్లలో మాత్రం ఇబ్బందిగా ఉంది. జిల్లాలో వార్షిక (ప్రతి ఏటా జూన్ 1నుంచి మరుసటి ఏడాది మే నెలాఖరు వరకు) సాధారణ వర్షపాతం 552.3 మిల్లీ మీటర్లు కాగా, మే నెలాఖరుకు 538 మి.మీ నమోదైంది. అందులో గత సెప్టెంబర్ నెలలో మాత్రమే ఏకంగా 239 మి.మీ నమోదు కావడం విశేషం. మిగతా నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జూన్ సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా 50.4 మి.మీ వర్షం మాత్రమే పడింది. సాధారణం కన్నా తక్కువ వర్షం పడడంతో దాని ప్రభావం భూగర్భ జలాలపై పడింది. దీంతో 44 మండలాల్లో పాతాళగంగ అడుగంటిపోతుండగా, 19 మండలాల్లో మాత్రం కొంత మెరుగ్గా కనిపిస్తోంది. కిష్టిపాడులో మరీ ఘోరం... పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో ఉన్న ఫిజోమీటర్కు భూగర్భ జలాలు అందని పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపు 50 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పుట్లూరులో 45.50 మీటర్ల అడుగున ఉన్నాయి. గుమ్మఘట్ట మండలం తాళ్లకెరెలో 33.92 మీటర్లు, సోమందేపల్లిలో 31.54, సోమందేపల్లి మండలం చాలకూరులో 30.76, పరిగిలో 29.43, అమడగూరులో 29.83, రాయదుర్గం మండలం బాగినాయకనహల్లిలో 29.15, కంబదూరు మండలం నూతిమడుగులో 29.10, పుట్లూరు మండలం మడ్డిపల్లిలో 28.80, బ్రహ్మసముద్రంలో 28.11, కణేకల్లు క్రాస్‌లో 26.56, మడకశిర మండలం కల్లుమర్రిలో 28.30, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 26.07, గుడిబండ మండలం మందలపల్లిలో 26.81, లేపాక్షిలో 25.74, డీ హిరేహాల్ మండలం ఓబులాపురంలో 24.24, యాడికి మండలం నిట్టూరులో 24.60, రొద్దం మండలం తురకలాపట్నంలో 23.28, బత్తలపల్లి మండలం కట్టకిందపల్లిలో 23.11, తనకల్లు మండలం చీకటిమానేపల్లిలో 22.98, కనగానపల్లిలో 22.70, బెళుగుప్ప మండలం గంగవరంలో 21.19, హిందూపురం మండలం మలుగూరులో 20.35, చిలమత్తూరులో 19.55 మీటర్లు ... ఇలా 44 మండలాల పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉంది. -
ప్రచారం ముగిసింది..
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : తొలివిడత స్థానిక ఎన్నికల ప్రచారం ముగిసింది. నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. మొదటి విడతలోని 20 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా... ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోరే ఉండనున్నట్లు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. రిజర్వేషన్ల పరంగా ఆయూ రాజకీయ పార్టీల్లోని చోటా, మోటా నాయకులకు ఈ సారి పోటీ చేసే చాన్స్ దక్కలేదు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కావడం... వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఆయూ పార్టీల్లోని నియోజకవర్గ నేతలు ఈ ఎన్నికలపై దృష్టిసారించలేదు. ఎమ్మెల్యే టికెట్ల ప్రయత్నాల్లో ఉండడంతో ‘స్థానికం’ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఒకరిద్దరు మినహా... ఎవ్వరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోవడంతో పలు మండలాల్లో ఆ పార్టీ అభ్యర్థుల మధ్య నేనా... నువ్వా అన్న విధంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేయడంతో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న టీడీపీ కూడా పలు మండలాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నర్సంపేట రెవెన్యూ డివిజన్లోని 7, ములుగు డివిజన్లోని 13 మండలాల్లో జరుగుతున్న జెడ్పీటీసీ స్థానాలకు రసవత్తరమైన పోటీ నెలకొంది. ములుగు డివిజన్లో కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి రంగంలో ఉండనున్నట్లు ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. నర్సంపేట డివిజన్లోని ఏడు మండలాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ చెరి సమానంగా జెడ్పీటీసీ స్థానాలను గెలిచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఒక మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి లేక పోవడంతో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వతంత్రులు సైతం ప్రధాన అభ్యర్థిలకు దీటుగా ప్రచారం చేయడం ఆయూ ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారుు. అదేవిధంగా... ములుగు డివిజన్లో 13 మండలాలు ఉన్నాయి. ఇందులోని 11 మండలాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రెండు మండలాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీనిస్తున్నారు. ప్రతి మండలంలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉన్నటు ప్రచారం జరుగుతున్నా... పోలింగ్ నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుట్టుగా తారుులాల సమర్పణ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు అటకెక్కడంతో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు గుట్టుగా ప్రచారంలోకి దిగారు. రాత్రి వేళ కుల పెద్దలు, సంఘాల నాయకుల వద్దకు వెళ్లి మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు ఉండడం వల్ల సమాచారం బయటకు పొక్కకుండా తారుులాలు సమర్పించుకుంటున్నారు. ముందే వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందని భావించి.. బడా నేతలు ఆలస్యంగా రంగంలో దిగినట్లు ఆయూ పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.