ప్రచారం ముగిసింది.. | End of the campaign .. | Sakshi
Sakshi News home page

ప్రచారం ముగిసింది..

Published Sat, Apr 5 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

End of the campaign ..

జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ :  తొలివిడత స్థానిక ఎన్నికల ప్రచారం ముగిసింది. నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. మొదటి విడతలోని 20 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా... ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోరే ఉండనున్నట్లు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి.
 
 రిజర్వేషన్ల పరంగా ఆయూ రాజకీయ పార్టీల్లోని చోటా, మోటా నాయకులకు ఈ సారి పోటీ చేసే చాన్స్ దక్కలేదు. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కావడం... వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఆయూ పార్టీల్లోని నియోజకవర్గ నేతలు ఈ ఎన్నికలపై దృష్టిసారించలేదు. ఎమ్మెల్యే టికెట్ల ప్రయత్నాల్లో ఉండడంతో ‘స్థానికం’ వైపు కన్నెత్తి చూడలేదు.
 
 దీంతో  మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఒకరిద్దరు మినహా... ఎవ్వరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోవడంతో పలు మండలాల్లో ఆ పార్టీ అభ్యర్థుల మధ్య నేనా... నువ్వా అన్న విధంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వేర్వేరుగా పోటీ చేయడంతో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న టీడీపీ కూడా పలు మండలాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.
 
 ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ
 నర్సంపేట రెవెన్యూ డివిజన్‌లోని 7, ములుగు డివిజన్‌లోని 13 మండలాల్లో జరుగుతున్న జెడ్పీటీసీ స్థానాలకు రసవత్తరమైన పోటీ నెలకొంది. ములుగు డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి రంగంలో ఉండనున్నట్లు  ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. నర్సంపేట డివిజన్‌లోని ఏడు మండలాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ చెరి సమానంగా జెడ్పీటీసీ స్థానాలను గెలిచే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఒక మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి లేక పోవడంతో కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని  అంచనా వేస్తున్నారు. స్వతంత్రులు సైతం ప్రధాన అభ్యర్థిలకు దీటుగా ప్రచారం చేయడం ఆయూ ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారుు. అదేవిధంగా... ములుగు డివిజన్‌లో 13 మండలాలు ఉన్నాయి. ఇందులోని 11 మండలాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. రెండు మండలాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీనిస్తున్నారు. ప్రతి మండలంలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉన్నటు ప్రచారం  జరుగుతున్నా...  పోలింగ్ నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
 గుట్టుగా తారుులాల సమర్పణ
 మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తు అటకెక్కడంతో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు గుట్టుగా ప్రచారంలోకి దిగారు. రాత్రి వేళ కుల పెద్దలు, సంఘాల నాయకుల వద్దకు వెళ్లి మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు ఉండడం వల్ల సమాచారం బయటకు పొక్కకుండా తారుులాలు సమర్పించుకుంటున్నారు. ముందే వస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందని భావించి.. బడా నేతలు ఆలస్యంగా రంగంలో దిగినట్లు ఆయూ పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement