మల్లన్నసాగర్ టెండర్లపై పీటముడి
ఇందులో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ మినహా మిగతా మూడు రిజర్వా యర్లకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొండపోచమ్మ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించడంతో దానికి ఇప్పట్లో టెండర్లు ఖరార య్యేలా కనిపించడం లేదు. కాగా మల్లన్నసాగర్‌కు ఎలాంటి ఆటంకాలు లేకున్నా ప్యాకేజీ లపై ఎటూ తేలడం లేదు. దీని వ్యయం భారీగా ఉండటంతో 4 ప్యాకేజీలుగా విభజిం చేందుకు సాంకేతిక అనుమతులివ్వాలని ప్రా జెక్టు అధికారులు మొదట ఉన్నతాధికా రుల కు విన్నవించారు. అయితే రిజర్వాయర్ నిర్మా ణాన్ని 2018 చివరికి పూర్తిచేయాలంటే ఎక్కు వ ప్యాకేజీలుగా విభజించి పనులు వేగిరం చే యాలని అధికారులు భావించి దీన్ని 5 ప్యాకే జీలు చేయాలని సూచించారు.ఇటీవల దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తిరిగి 4ప్యాకేజీలకే మొగ్గుచూపింది. ఈ మేరకు అధికారులు ప్రతి పాదనలు పంపగా, తిరిగి ఉన్నతాధికారులు దీన్ని నిలిపివేసినట్లు తెలిసింది.