కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా, అరెస్టు
Published Mon, Nov 14 2016 12:58 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇక్కట్లు పడుతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మోడీ చర్యకు నిరసనగా ఆబిడ్స్ జనరల్ పోస్టాఫీసు(జీపీఓ) వద్ద టీ కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు నగర నాయకులు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, సుధీర్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లధనం వెలికితీతకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదంటూ ముందస్తు ఆలోచన, ప్రణాళిక లేకుండా ఉన్నఫళంగా ప్రధాని పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా నల్లధనం వెలికితీతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement