కాంగ్రెస్ అంటేనే అవినీతి కూపం: ఓదేలు | Congress means corruption shaft: odelu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అంటేనే అవినీతి కూపం: ఓదేలు

Published Thu, Aug 18 2016 4:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ అంటేనే అవినీతి కూపం: ఓదేలు - Sakshi

కాంగ్రెస్ అంటేనే అవినీతి కూపం: ఓదేలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన విమర్శలు ఆ పార్టీ దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పేర్కొన్నారు. రెండేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై మాట్లాడే ముందు తమ పదేళ్ల దోపిడీ పాలనను గుర్తు చేసుకోవాలని, అసలు కాంగ్రెస్ అంటేనే ఓ అవినీతి కూపమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓదేలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా రైతుల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పాపాల పాలనపై దిగ్విజయ్ మాట్లాడితే బావుంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మరికొందరు తెలంగాణ ద్రోహులు చెప్పిన మాటలు విని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును విమర్శించడం చూస్తుంటే దిగ్విజయ్ అంటే జాలేస్తోందన్నారు. ఇకనైనా దిగ్విజయ్ తన తీరు మార్చుకోవాలని ఓదేలు హితవు పలికారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement