విశ్వనగరానికి సహకరిస్తాం: దత్తాత్రేయ
ఐటీఐఆర్‌పై కేంద్ర మంత్రికి డీపీఆర్ అందజేసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విశ్వనగరానికి అన్నిరకాల సాయం చేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) విషయంలో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. ఐటీఐఆర్ విషయంలో కేంద్రం నుంచి సహకారం లేదని ఇటీవల ఐటీ మంత్రి తారకరామారావు ఆరోపించడం, రాష్ట్ర ప్రభుత్వం అసలు డీపీఆర్ సమర్పించలేదని దత్తాత్రేయ ప్రత్యారోపణ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కేటీఆర్ మంగళవా రం ఆ శాఖ ఉన్నతాధికారులతో కలసి దత్తాత్రేయను కలిశారు. 2012లో అప్పటి ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన డీపీఆర్ ను చూపిం చారు. దాంతో పాటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు వివిధ అంశాలపై గంటసేపు చర్చించుకున్నారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రతిపాదనలకు దత్తాత్రేయ సానుకూలంగా స్పందిం చారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి రుణ రూపంలో ఇచ్చిన నిధులను కలిపి చెప్పారని విలేకరుల ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలసి ముందుకెళ్తామన్నారు.
అన్ని విధాలా సాయమందిస్తాం..
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉం దని బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్‌గా మారేందుకు అన్ని అవకాశాలున్నాయన్నారు. కేటీఆర్ దేశ, విదేశాల్లో విస్తృత ంగా పర్యటించి ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు.