సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కారణమని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వీసీని వెంటనే తొలగించి రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థుల బహిష్కరణ అప్రజాస్వామికమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బహిష్కరణను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించినపుడు రోహిత్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
చిన్ని చిన్ని ఘర్షణలను ఆసరాగా చేసుకుని దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు వీసీపై తీవ్ర ఒత్తిడిని తీసుకురావడం వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు.
దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలి: తమ్మినేని
Published Wed, Jan 20 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement
Advertisement