హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలయ్యాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న .....
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలయ్యాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారయంత్రాంగం రెవెన్యూ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టింది. కొందరు అధికారులు ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో పెద్దఎత్తున బదిలీలు చేపట్టినట్లు చర్చసాగుతోంది.
ఈ తరుణంలో జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలోని మండల తహశీల్దార్ల కార్యాలయాలతోపాటు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 19 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్ కె.నిర్మల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ తహశీల్దార్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.