హైదరాబాద్ : హైదరాబాదు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూహెచ్) అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. యూనివర్శిటీ ఇప్పటికీ కాలేజీలకు ఎగ్జామ్ మెటీరియల్తో పాటు హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కాలేజీలు కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ మెటీరియల్, హాల్ టికెట్లు అందచేస్తామని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందాకే కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తామని కాలేజీలు చెబుతున్నాయి.
కాలేజీల నుంచి దాదాపుగా రూ.50 కోట్ల బకాయిల్లో కొంతైనా చెల్లించాలని జేఎన్టీయూహెచ్ డిమాండ్ చేస్తోంది. దీంతో పరీక్షలు దగ్గర పడుతున్నా హాల్ టికెట్లు అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ప్రశ్నర్థకంగా జేఎన్టీయూహెచ్ సెమిస్టర్ ఎగ్జామ్స్!
Published Sat, Apr 30 2016 6:20 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement