నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి వద్దు | Do not want to dharnas and rallies in the cities | Sakshi
Sakshi News home page

నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి వద్దు

Published Wed, Mar 1 2017 2:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

Do not want to dharnas and rallies in the cities

హైకోర్టులో పిల్‌... విచారణకు స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వానికి, పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్లకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

ఇందిరాపార్క్, ధర్నాచౌక్‌తో పాటు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాల నిర్వహణకు పోలీసులు అనుమతులిస్తున్నారని, దీనివల్ల ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement