సాక్షి, హైదరాబాద్: వన్యమృగాల దాడిలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని అటవీ పర్యావరణ శాఖ రెట్టింపు చేసింది. ప్రస్తుతం వన్యమృగాల దాడిలో ఎవరైనా చనిపోతే వారి వారసులకు ప్రభుత్వం రూ. 2.50 లక్షలు నష్ట పరిహారం కింద చెల్లిస్తోంది. దీనిని రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అడవి జంతువుల దాడిలో గాయపడిన వారికి ప్రస్తుతం రూ. 75 వేలు పరిహారం ఇస్తుండగా ఇక నుంచి మొత్తం వైద్య ఖర్చులతోపాటు రూ. 75 వేలు పరిహారం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.